చైనా (china)కమ్యూనిస్టు దేశం కదా! అక్కడ గుళ్లు గోపురాలు ఉంటాయా? మందిరాలు(Temples), ఆరామాలు ఉంటాయా? అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. అక్కడా ప్రార్థనమందిరాలుంటాయి. కాకపోతే ఆలయాలకు వెళ్లేవారు తక్కువగా ఉంటారు. ఇప్పుడు సీన్‌ రివర్సయ్యింది. నాస్తిక, మార్కిస్టు విధానాలతో కూడిన చదువు చదివిన చైనా యువతీ యువకుల మనసు మారింది. నెమ్మదిగా ఆస్తికవాదంవైపు అడుగులు వేస్తున్నారు.

చైనా (china)కమ్యూనిస్టు దేశం కదా! అక్కడ గుళ్లు గోపురాలు ఉంటాయా? మందిరాలు(Temples), ఆరామాలు ఉంటాయా? అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. అక్కడా ప్రార్థనమందిరాలుంటాయి. కాకపోతే ఆలయాలకు వెళ్లేవారు తక్కువగా ఉంటారు. ఇప్పుడు సీన్‌ రివర్సయ్యింది. నాస్తిక, మార్కిస్టు విధానాలతో కూడిన చదువు చదివిన చైనా యువతీ యువకుల మనసు మారింది. నెమ్మదిగా ఆస్తికవాదంవైపు అడుగులు వేస్తున్నారు. ఆలయాలకు వెళుతున్నారు. ఇంతకు ముందు యువత ఏదో ఒక పని చేస్తూ దేశ జీడీపీ వృద్ధిలో భాగస్వాములయ్యారు.

ఇప్పుడు పరిస్థితి మారింది. 1981-1996 మధ్యలో పుట్టిన వారు, 1996 - 2010 మధ్యలో పుట్టిన వారు పనులు చేయడం మానేశారు. అధిక ఒత్తిడి(Pressure), శ్రమను తట్టుకోలేక ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. బుద్ధిజం, టావోయిజంలను అనుసరిస్తున్నారు. ఆయా మతాలను ఆచరిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాల్లో పెద్ద జీతాలతో పని చేస్తున్న యువతీ యువకులు ఉద్యోగాలకు విరామమిచ్చారు. ఆలయాలను సందర్శిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆ విధంగా మానసిక ఒత్తిడికి గురి కాకుండా చేసుకుంటున్నారు.

కోవిడ్‌ వైరస్‌(Covid Virus) స్వైర విహారం చేస్తున్న సమయంలో చైనా ప్రభుత్వం అనివార్యంగా లాక్‌డౌన్‌(Lockdown) విధించాల్సివచ్చింది. అప్పుడు యువత ఇంటిపట్టునే ఉండింది. ఆ సమయంలో జీవితం అంటే పని మాత్రమే కాదని, మనిషికి ప్రశాంతత అవసరమని తెలుసుకున్నారు. ఆ తత్వం బోధపడిన తర్వాత పనులకు వెళ్లడం మానేశారు. కరోనా దాదాపుగా కనుమరుగవ్వడంతో అప్పుడు నిలిచిన కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి.

లాస్టియర్‌ 17.5 శాతం నిరుద్యోగం(unemployment) ఉంటే ఇప్పుడది 18.1 శాతానికి చేరుకుంది. ఇలాగే కొనసాగితే దేశాభివృద్ధి కుంటుపడుతుంది. ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఊరట కలిగించే విషయమేమిటంటే యువత ఆలయాల సందర్శన కారణంగా పర్యాటక రంగం ఊపందుకోవడం. ఇంతకు ముందు వీకెండ్స్‌లో యూత్‌ జాలీ ట్రిప్పులకు వెళ్లేది. ఇప్పుడు ఆలయానికి వెళుతున్నారు యువతీ యువకులు. పూజలు చేస్తున్నారు. బోధనలు వింటున్నారు.

ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. బీజింగ్‌లో ఉన్న పురాతన బౌద్ధ ఆలయం యోంగె ప్యాలెస్‌కు భక్తుల తాకిడి పెరగడమే ఇందుకు ఉదాహరణ. మార్చి నెల నుంచి రోజూ 40 వేల మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారట! హాంగ్జూస్‌లోని లింగ్యిన్‌ టెంపుల్‌కు రోజూ చేంతాడంత క్యూ ఉంటోంది.ఒత్తిడిని దూరం చేసుకోవడానికి, అంతా మంచే జరగడానికి యువత భక్తి మార్గాన్ని ఎంచుకుంటోంది. ఆలయాల సందర్శన 310 శాత పెరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

చైనాలో బుద్ధిజం, టావోయిజం, కన్ఫ్యూషనిజం మతాలను అనుసరించేవారు ఎక్కువ. గతంలో పండుగలు పబ్బాలప్పుడే ఆలయాల్లో రద్దీ ఉండేది. ఇప్పుడు మామూలు రోజుల్లోనూ రద్దీ ఉంటోంది. ఆలయాలను సందర్శిస్తున్న యువతకు మాంక్‌, సన్‌లుగా మారే ఉద్దేశం లేదు. కేవలం ప్రశాంతత కోసమే వారు టెంపుల్స్‌కు వెళుతున్నారు. ఆలయాల దగ్గర అమ్ముతున్న వస్తువులను కూడా యువతీయువకులు కొంటున్నారు. చాలా మట్టుకు పూసల కంకనాలను కొని ధరిస్తున్నారు. దాని వల్ల అదృష్టం కలుగుతుందని నమ్ముతున్నారు . అలా చేస్తే కలిమి వస్తుందని, కెరీర్‌లో స్థిరపడతామని, చదువులో రాణించగలుగుతామని నమ్ముతున్నారు.

కోరిన కోర్కెలు నెరవేరతాయని విశ్వసిస్తున్నారు. లాటరీ టికెట్లు కూడా కొంటున్నారు. తాము ధరించిన వస్తువులకు మహిమలు ఉన్నాయని భావిస్తున్నారు.ఆ శక్తి ఉందనే భావనతో ఈ పోకడ పెరుగుతోంది. అంతే కాదు వీటిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతున్నారు. తాము ఫలానా దేవాలయానికి వెళ్లామని, ఇలాంటి పూజా వస్తువులు కొనుగోలు చేశామనే చర్చలు చైనా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కన్పిస్తున్నట్లు సమాచారం. అక్కడి పత్రికలు మాత్రం చైనా యువత పోకడలను తప్పుపడుతున్నాయి. కష్టపడి పని చేయాలి తప్ప ఆలయాల చుట్టూ తిరిగితే లాభం ఉండదని చెబుతున్నాయి.

Updated On 13 July 2023 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story