Street Girlfriend Trend : కౌగిలింతకు 11 రూపాయలు, ముద్దుకు 110 రూపాయలు! భలే మంచి చౌక బేరము!
11 రూపాయలిచ్చేసి కౌగిలించుకోవచ్చు
ఓ అమ్మాయిని కౌగిలించుకోవాలనిపిస్తుందనుకోండి(Hug).. 11 రూపాయలిచ్చేసి కౌగిలించుకోవచ్చు. ముద్దు(Kiss) పెట్టుకోవాలనిపించిదనుకోండి.. 110 రూపాయలిచ్చి అది ఆ పని కూడా కానించేయవచ్చు. ఇదంతా ఒంటరిగా ఉన్న అబ్బాయిల కోసమే సుమీ! అలాగని సింగిల్ కుర్రాళ్లు సంబరపడిపోకండి.. ఈ ఆఫర్లు మన దేశంలో కాదు.. మన పొరుగున ఉన్న చైనాలో(China).. ఇప్పుడక్కడ ఈ ట్రెండ్ నడుస్తోంది. స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్(Street Girlfriend) ట్రెండ్ అన్నమాట! ఆ దేశ యువతులు ఏకంగా వీధుల్లో స్టాల్స్ పెట్టుకున్నారు. ‘లవ్ మీ ఇఫ్ యూ కెన్’అని(Love Me If You Can.?) బోర్డులు పెట్టుకుంటున్నారు. చైనాలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ జోరుగా సాగుతోందని, , ఇందులో సింగిల్స్ కుర్రాళ్లు ఈ ట్రెండ్ కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని స్థానిక మీడియా చెబుతోంది. నచ్చిన అమ్మాయికి 11 రూపాయలిచ్చి హగ్ చేసుకోవచ్చు. 110 రూపాయలిచ్చి ముద్దు పెట్టుకోవచ్చు. సినిమాకు కూడా తీసుకెళ్లవచ్చు. అందుకు15 యువాన్లు అంటే 150 రూపాయలు ఇచ్చుకోవాలి.
చైనా షెన్‌జెన్ నగర వీధుల్లో ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ బిజినెస్ కనిపిస్తుంది. ఎవరైనా ఒంటరిగా ఫీల్ అయ్యే సింగిల్ అబ్బాయిలు తమ దగ్గరకు వస్తున్నారని అమ్మాయిలు చెబుతున్నారు. అన్నట్టు ఇంటికి తీసుకెళ్లి కలిసి మందుకూడా కొట్టొచ్చు. అందుకు గంటకు 40 యువాన్లు అంటే 460 రూపాయలు చెల్లించాలి. ఇంతకు మించి మీరు ఊహిస్తున్నదేమీ ఉండదు.