రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా యుద్ధం కొనసాగుతోంది. ఈ రెండు దేశాలు పోటా పోటిగా యుద్ద౦ కొనసాగిస్తున్నాయి . అయితే వీటి పోరు వల్ల ఉక్రెయిన్ ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి.. వేలమంది ప్రాణాలు కోల్పోయారు . తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది . కానీ వీటి మధ్య యుద్ధం మాత్రం తగ్గడం లేదు . మరో వైపు రష్యాపై అనేక ఆంక్షలను విధించిన పాశ్చాత్య దేశాలు ..... ఆర్థిక, వాణిజ్య, సంబంధాలను తెంచుకున్నాయి. రష్యాపై […]

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా యుద్ధం కొనసాగుతోంది. ఈ రెండు దేశాలు పోటా పోటిగా యుద్ద౦ కొనసాగిస్తున్నాయి . అయితే వీటి పోరు వల్ల ఉక్రెయిన్ ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి.. వేలమంది ప్రాణాలు కోల్పోయారు . తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది . కానీ వీటి మధ్య యుద్ధం మాత్రం తగ్గడం లేదు . మరో వైపు రష్యాపై అనేక ఆంక్షలను విధించిన పాశ్చాత్య దేశాలు ..... ఆర్థిక, వాణిజ్య, సంబంధాలను తెంచుకున్నాయి. రష్యాపై అనేక ఆంక్షలను కూడా విధించాయి. . ఉక్రెయిన్ కు కొన్ని దేశాలు మద్దతు ప్రకటించడం తో పాటు .... భారీగా యుద్ధ సామాగ్రిని అందిస్తూ సహకరిస్తున్నాయి . . మరో వైపు ఉక్రెయిన్ కు ఆర్హిక సహాయాన్ని కూడా అందిస్తున్నాయి .

మరోవైపు రష్యాకు చైనా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను సరఫరా చేస్తోందని అమెరికా అనుమానాలను వ్యక్తం చేస్తోంది. దీనికి తగిన సాక్ష్యాధారాలను కూడా సేకరించినట్లు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ విలియం బర్న్స్ చెప్పారు. ఉక్రెయిన్ లో మరింత విధ్వంసాన్ని సృష్టించడానికే రష్యాకు చైనా పలు రకాల ఆయుధాలను అందిస్తోందని ఆరోపిస్తున్నారు అంతే కాదు ఈ విషయాన్ని తాము బలంగా నమ్ముతున్నామని అన్నారు
అమెరికన్ మీడియా సంస్థ సీబీఎస్ కు ఇచ్చిన ఫేస్ ద నేషన్ ఇంటర్వ్యూలో విలియం బర్న్న్ వెల్లడించారు.

అయితే ఆ ఆయుధాల గురించి తమకు ఇంకా పూర్తి విషయాలు తెలియవలసి ఉ౦దని అన్నారు. దీనిపై ఆరా తీసే ప్రయత్నాలు చేస్తున్నామని విలియం బర్న్న్ చెప్పారు. ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధాన్ని ఆరంభించిన అనంతరం తాను కీవ్ కు వెళ్లాల్సి వచ్చిందని, అప్పుడే- రష్యా వినియోగించే ఆయుధాల గురించి తెలుసుకున్నానని అన్నారు . రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. బెలారస్ సరిహద్దు నుంచి ఉక్రెయిన్ పై మెరుపు దాడి చేసి.. కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలను రూపొందించుకున్నట్లు తమ నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్‌స్కీకి చేరవేశామని, ఫలితంగా ఉక్రెయిన్ సైన్యం అప్రమత్తమైనట్లు చెప్పారు.

Updated On 27 Feb 2023 8:34 AM GMT
Ehatv

Ehatv

Next Story