China : బాబ్బాబు.. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని పుణ్యం కట్టుకోండి ప్లీజ్!
అమ్మాయిలు, అబ్బాయిలు ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనండి.. మీకు పుణ్యం ఉంటుంది...!
అమ్మాయిలు, అబ్బాయిలు ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనండి.. మీకు పుణ్యం ఉంటుంది...! అంటూ చైనా(China) ప్రభుత్వం బతిమాలుకుంటోంది. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలను కనండి.. ఆలస్యంగా రిటైర్ అవ్వండి అంటూ వేడుకుంటున్నది. చైనా ఇంతగా ఎందుకు బతిమాలాల్సి వస్తున్నదంటే ఆ దేశంలో జనాభా తగ్గిపోతున్నది(Population).. వృద్ధుల సంఖ్యేమో పెరిగిపోతున్నది. పెళ్లీడు రాగానే ఓ ఇంటివాళ్లను చేసేందుకు నేషనల్ హెల్త్ కమిషన్(National health commission) తెగ ప్రయత్నిస్తోంది. అయినా యువత మాత్రం పెళ్లికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ప్రస్తుతం చైనాలోని నిబంధనలు ప్రకారం యువకులు 22 ఏళ్లు నిండిన తర్వాత, యువతులు 20 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అయితే చాలీ చాలనీ జీతాలతో పెళ్లి ఎలా చేసుకోవడం అన్నది యువత అడుగుతున్న ప్రశ్న. పెళ్లాయక పిల్లలు పుడితే వారిని పెంచడానికి తడిసి మోపెడవుతుందని అనుకుంటున్నారు. కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం మాత్రం రిక్వెస్టుల మీద రిక్వెస్టులు చేస్తున్నది. ఇందులో భాగంగానే రిటైర్మెంట్ వయసు కూడా పెంచింది. ప్రోత్సాహకాలను అందిస్తోంది.