10 days Unhappy Leave : ఇలాంటి బాసులు కూడా ఉంటారా? నెటిజన్ల ఆశ్చర్యం!
చైనాకు(China) చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులకు బ్రహ్మాండమైన ఆఫర్‌ను ఇచ్చింది. ప్రముఖ రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లాయ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యు డాంగ్లాయ్(Yu Danglai) తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తమ కంపెనీకి లాభాలను తెచ్చిపెడుతున్న ఉద్యోగులకు పది రోజుల లీవ్ ఆఫర్ ఇచ్చారు. విధులకు వచ్చేందుకు మానసికంగా సిద్ధం లేని రోజున లీవ్ పెట్టవచ్చు. సెలవు కుదరదని మేనేజ్‌మెంట్ చెప్పడానికి వీల్లేదు.
చైనాకు(China) చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులకు బ్రహ్మాండమైన ఆఫర్‌ను ఇచ్చింది. ప్రముఖ రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లాయ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యు డాంగ్లాయ్(Yu Danglai) తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తమ కంపెనీకి లాభాలను తెచ్చిపెడుతున్న ఉద్యోగులకు పది రోజుల లీవ్ ఆఫర్ ఇచ్చారు. విధులకు వచ్చేందుకు మానసికంగా సిద్ధం లేని రోజున లీవ్ పెట్టవచ్చు. సెలవు కుదరదని మేనేజ్‌మెంట్ చెప్పడానికి వీల్లేదు. ప్రతీ ఉద్యోగి స్వేచ్ఛగా ఉండాలన్నది యు డాంగ్లాయ్ అభిలాష. ఉద్యోగుల గురించి ఆయన ఏమన్నారంటే ' ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉంటుంది. ఆ సమస్య మనసును కుదురుగా ఉండనివ్వదు. అలాంటిసమయంలో వారు సెలవు తీసుకోచ్చు. ఈ సెలవు వల్ల వారు తమ మనసును తేలిక పరచుకుని సరి కొత్త ఉత్సాహంతో తిరిగి విధుల్లోకి వస్తారు. ఉద్యోగులను ఓవర్‌టైమ్ పని చేయమని బలవంతం చేయడం అనైతికమన్నది నా అభిప్రాయం. రోజుకు ఏడు గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు. వారాంతాల్లో సెలవులు ఉండాలి. వార్షిక సెలవులు 30 నుంచి 40 వరకు ఉండాలి. మా కంపెనీ అత్యధిక లాభాలు ఆర్జించాలని మేము కోరుకోవడం లేదు. మా ఉద్యోగులు ఆరోగ్యంగా, ప్రశాంతంగా జీవించాలని మాత్రమే కోరుకుంటున్నాము. దానివల్ల కంపెనీ అభివృద్ధి చెందుతుంది' అని అన్నారు. పాంగ్ డాంగ్ లై సూపర్‌మార్కెట్‌లో పని చేసే ఉద్యోగుల సగటు నెలవారీ జీతం 7,000 యువాన్లు ఉంటుంది. మన కరెన్సీలో చెప్పాలంటే ఇంచుమించు 81 వేల రూపాయలు. అన్‌హ్యాపీ లీవ్(Unhappy Leave) కింద ఏడాదిలో పది రోజుల లీవ్‌ను సంస్థ ఇస్తున్నది. వార్షిక సెలవులకు ఇది అదనమన్నమాట! ఇప్పుడు యు డాంగ్లాయ్ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన ఆలోచనను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇంత మంచి బాస్ ఉంటారా? అని ఓ నెటిజన్ ఆశ్చర్యపోయాడు. అర్జెంటుగా ఉన్న ఉద్యోగం వదిలిపెట్టి పాంగ్ డాంగ్ లాయ్ మార్కెట్‌లో చేరాలనిపిస్తోంది అని మరొకరు అన్నారు.