China LPG Leak Blast : రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. 31 మంది దుర్మరణం
చైనాలోని ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్ కారణంగా సంభవించిన భారీ పేలుడులో 31 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటన చైనా వాయువ్య నగరమైన యిన్‌చువాన్‌లో జరిగింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(LPG) లీక్ కావడంతో పేలుడు సంభవించిందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
చైనా(China)లోని ఓ రెస్టారెంట్(Restuarent)లో గ్యాస్ లీక్(Gas Leak) కారణంగా సంభవించిన భారీ పేలుడు(Blast)లో 31 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటన చైనా వాయువ్య నగరమైన యిన్‌చువాన్(Yinchuan)లో జరిగింది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్(LPG) లీక్ కావడంతో పేలుడు సంభవించిందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
యించువాన్ నివాస ప్రాంతంలోని ఫుయాంగ్ బార్బెక్యూ రెస్టారెంట్(Phuong Barbeque Restaurant)లో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో పేలుడు సంభవించింది. చైనాలోని నాన్జింగ్ ప్రావిన్స్(Nanjing Province)రాజధాని యించువాన్. ప్రస్తుతం అక్కడ మూడు రోజుల డ్రాగన్ బోట్ ఫెస్టివల్(Dragon Boat Festival)జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకుని స్నేహితులతో పార్టీలు చేసుకుంటున్నారు. అనుకోని సంఘటనతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికక్కడే పరిస్థితిని అదుపు చేశారు. పేలుడు కారణంగా రెస్టారెంట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ రెస్టారెంట్ సమీపంలోనే అనేక ఇతర రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. మంటలు ఇతర రెస్టారెంట్లకు వ్యాపించకుండా సకాలంలో మంటలు అదుపులోకి తెచ్చారు. ఘటన తర్వాత అన్ని పరిశ్రమల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్(China President Xi Jinping) ఆదేశించారు.