China : చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. వ్యాక్సిన్‌ల కోసం పట్టుబడుతున్న అధికారులు
కరోనా(Corona) వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా(Chinna) అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ యొక్క కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవటానికి చైనా అధికారులు వ్యాక్సిన్‌ల కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. జూన్ నాటికి ఈ కొత్త వేరియంట్ దేశమంతటా వేగంగా వ్యాపిస్తుందని..
కరోనా(Corona) వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా(China) అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ యొక్క కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవటానికి చైనా అధికారులు వ్యాక్సిన్‌ల కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. జూన్ నాటికి ఈ కొత్త వేరియంట్ దేశమంతటా వేగంగా వ్యాపిస్తుందని.. సుమారు 65 మిలియన్ల మందికి సోకుతుందని నివేదికలున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
చైనీస్ ఎపిడెమియాలజిస్ట్ జాంగ్ నాన్షాన్ సోమవారం మాట్లాడుతూ.. XBB ఓమిక్రాన్ సబ్-వేరియంట్‌ల (XBB. 1.9.1, XBB. 1.5, మరియు XBB. 1.16) కోసం రెండు కొత్త వ్యాక్సిన్‌లు లాంచ్ చేయడానికి ఆమోదం పొందాయి. మూడు నుండి నాలుగు ఇతర వ్యాక్సిన్‌లు త్వరలో ఆమోదించబడతాయని జాంగ్ చెప్పారు. చైనాలోని అధికారులు ప్రస్తుత వేవ్ తక్కువ తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ వేవ్‌ను ఎదుర్కోవటానికి చర్యలు తీసుకోకపోతే వృద్ధులలో మరణాల రేటు పెరుగుతుందని ప్రజారోగ్య నిపుణులు భయపడుతున్నారు.
బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. గత నెలతో పోలిస్తే ఈ వేరియంట్ సోకిన వ్యక్తుల సంఖ్య పెరిగింది. మళ్లీ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయని, అయితే గత శీతాకాలం మాదిరిగా ఆసుపత్రులు రద్దీగా ఉండవని ఆరోగ్య నిపుణులు చైనా ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, మాస్కులు ధరించాలని నిపుణులు సూచించారు.