China Bueatiful Governor : అందమైన మహిళా గవర్నర్.. 52 మందితో లైంగిక సంబంధాలు
చైనాలో(China) ఒక మహిళా అధికారికి(Female officer) 13 సంవత్సరాల జైలు శిక్షతో(Imprisonment) పాటు ఒక మిలియన్ యువాన్ (సుమారు ₹ 1.18 కోట్లు) జరిమానా(Fine) విధించారు
చైనాలో(China) ఒక మహిళా అధికారికి(Female officer) 13 సంవత్సరాల జైలు శిక్షతో(Imprisonment) పాటు ఒక మిలియన్ యువాన్ (సుమారు ₹ 1.18 కోట్లు) జరిమానా(Fine) విధించారు. జాంగ్ యాంగ్(Zhong Yang), "అందమైన గవర్నర్"(beautiful governor) గిజౌ ప్రావిన్స్‌లోని(Guizhou Province) కియానాన్ ప్రిఫెక్చర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(Communist Party in Qiannan Prefecture) గవర్నర్‌గా, డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. ఆమె 58 మంది మగ సబార్డినేట్‌లతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని, దాదాపు 60 మిలియన్ యువాన్‌లను లంచంగా స్వీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. 52 ఏళ్ల గవర్నర్ 22 సంవత్సరాల వయస్సులో కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (NPC)లో డిప్యూటీ హోదాకు ఎదిగారు. రైతులకు సహాయం చేసే లక్ష్యంతో వ్యవసాయ సంఘాన్ని ప్రారంభించడంతోపాటు, అవసరమైన వృద్ధులను ఆదుకోవడానికి తన సొంత డబ్బును ఖర్చు చేయడం కోసం జాంగ్ ప్రసిద్ధి చెందింది.
జనవరిలో Guizhou రేడియో, టెలివిజన్ నిర్మించిన ఒక డాక్యుమెంటరీ జాంగ్‌కు సంబంధించిన వివాదాలను బయటపెట్టింది. జాంగ్ లంచాలను స్వీకరించారని, ప్రభుత్వ పెట్టుబడి సాకుతో ఆమె ఇష్టపడే కంపెనీలు లాభదాయకమైన కాంట్రాక్టులను పొందేలా చూసేందుకు తన స్థానాన్ని ఉపయోగించుకున్నారని ప్రసారం చేసింది. ఇందులో ఆమెతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యాపారవేత్త కోసం హైటెక్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు.
అంతేకాకుండా, 52 ఏళ్ల గవర్నర్ 58 మంది మగ సబార్డినేట్‌లతో లైంగిక కార్యకలాపాలు కొనసాగించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆమె అందించిన ప్రయోజనాల కారణంగా కొందరు ఆమెతో సెక్స్‌లో పాల్గొనగా, మరికొందరు ఆమె అధికారానికి భయపడి అయిష్టంగానే సెక్స్ చేసేవారు.