సుమారు మూడేళ్లపాటు ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా వైరస్‌(Corona) ఇప్పుడిప్పుడే కాస్త నెమ్మదించింది. దాదాపుగా అంతరించింది. మూడేళ్ల పాటు ఆ వైరస్‌ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. లక్షలాది మంది ఉసురు తీసింది. దేశాల ఆర్ధిక వ్యవస్థను(Economic) చిన్నాభిన్నం చేసింది. రోజువారీ కూలీల బతుకులను ఛిద్రం చేసింది. ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోకముందే ఇప్పుఉ మరో సిండ్రోమ్‌ భయభ్రాంతులను చేస్తోంది. దక్షిణ అమెరికా(South America) దేశం చిలీని గిలాన్‌ బరే (GBS) అనే సిండ్రోమ్‌ వణికిస్తోంది.

సుమారు మూడేళ్లపాటు ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా వైరస్‌(Corona) ఇప్పుడిప్పుడే కాస్త నెమ్మదించింది. దాదాపుగా అంతరించింది. మూడేళ్ల పాటు ఆ వైరస్‌ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. లక్షలాది మంది ఉసురు తీసింది. దేశాల ఆర్ధిక వ్యవస్థను(Economic) చిన్నాభిన్నం చేసింది. రోజువారీ కూలీల బతుకులను ఛిద్రం చేసింది. ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోకముందే ఇప్పుఉ మరో సిండ్రోమ్‌ భయభ్రాంతులను చేస్తోంది. దక్షిణ అమెరికా(South America) దేశం చిలీని(Chile) గిలాన్‌ బరే (GBS) అనే సిండ్రోమ్‌ వణికిస్తోంది.

వింత వ్యాధి బారిన పడిన ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిస్థితిని ఎలా నియంత్రించాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఏం చేయాలో తెలియక దేశ వ్యాప్తంగా మూడు నెలల పాటు ఎమర్జెన్సీ(Emergency) విధించింది. నరాల వ్యవస్థపై ఈ సిండ్రోమ్‌ దాడి చేస్తుంది. కొన్ని రోజులకే కండరాల వ్యవస్థను(Muscular system) పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఇది సోకిన వారికి విపరీతమైన నిస్సత్తువ ఆవరిస్తుంది. అవయవాలు(Organs) మొద్దుబారిపోతాయి. మొదట కాళ్లలో(Legs) మొదలవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా పైకి పాకుతూ శరీరమంతా ఆక్రమిస్తుంది.

వ్యాధి ముదిరితే పక్షవాతం(Paralysis) కూడా రావచ్చు. జీబీ సిండ్రోమ్‌(GB Syndrome) ఎందుకు వస్తుందో ఎవరికీ తెలీదు. కాకపోతే కాంపిలోబాక్టర్‌ జెజునీ బ్యాక్టీరియా(Campylobacter jejuni bacteria) ఈ సిండ్రోమ్‌కు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఇన్‌ఫ్లుయెంజా(Influenza), సైటో మెగలూ(Saito Megaloo), ఎప్‌స్టెయిన్‌బర్‌తో(Epsteinber) పాటు కోవిడ్‌ వైరస్‌(covid virus) కూడా బీజీఎస్‌కు దారి తీసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన నీరసం ఉన్నట్లయితే మాత్రం వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది. నరాల పరీక్షతో(Nerve system) బీజీఎస్‌ ఉందో లేదో తెలుస్తుంది.

మెట్లు ఎక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు విపరీతమైన నీరసం వస్తే మాత్రం జీబీఎస్‌ తొలి లక్షణమని అనుకోవాలి. తర్వాతి స్టేజ్‌లో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బలహీనపడతాయి. అప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. వెంటిలేటర్‌ సాయంతో ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత రెండే రెండు వారాల్లో రోగి కదల్లేని స్థితికి చేరుకుంటాడు. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. అంటే మెదడు సక్రమంగా పని చేయదు. విపరీతమైన బాధ ఉంటుంది. చూపు మందగిస్తుంది. మాట్లాడటం కష్టమవుతుంది. నమలడం, మింగడం కూడా కష్టంగా మారుతుంది. అరచేతులు, అరికాళ్లలో సూదులు గుచ్చుతున్నంత నొప్పి వేస్తుంది. హార్ట్‌ బీట్‌ పెరుగుతుంది. బీపీ కూడా పెరుగుతుంది. జీబీఎస్‌కు ఇప్పటి వరకైతే చికిత్స లేదు. రోగ తీవ్రతను తగ్గించగలరేమో కానీ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు.

Updated On 11 July 2023 2:09 AM GMT
Ehatv

Ehatv

Next Story