Chaos in Syria: సిరియాలో కల్లోలం.. దేశం వదిలి పారిపోయిన అధ్యక్షుడు
సిరియాలో సాయుధ తిరుగుబాటుదారులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. దేశ అధ్యక్షుడు బషర్ అల్- అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు.
![Chaos in Syria: సిరియాలో కల్లోలం.. దేశం వదిలి పారిపోయిన అధ్యక్షుడు Chaos in Syria: సిరియాలో కల్లోలం.. దేశం వదిలి పారిపోయిన అధ్యక్షుడు](https://www.ehatv.com/h-upload/2024/12/08/738361-bonnie-blue-2024-12-08t115302486.webp)
Chaos in Syria: సిరియాలో కల్లోలం.. దేశం వదిలి పారిపోయిన అధ్యక్షుడు
సిరియాలో సాయుధ తిరుగుబాటుదారులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. దేశ అధ్యక్షుడు బషర్ అల్- అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ రాజధాని డెమాస్కస్(Damascus) శివార్ల వరకు వచ్చారు. ఈ కారణంగా దేశమంతటా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు బషర్ అల్ -అసద్ (Bashar al-Assad)దేశం వదిలేసి పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను అధ్యక్ష కార్యాలయం కొట్టేసింది.
.మరోవైపు డెమాస్కన్‌ను చుట్టుముట్టడం ద్వారా ఆపరేషన్ చివరి దశను ప్రారంభించినట్లు హయాత్ తహరీర్ అల్ షమ్(Hayat Tahrir al-Sham) (HTS) నేతృత్వంలోని తిరుగుబాటుదళాల ప్రతినిధి హసన్ అబ్దుల్ ఘనీ తెలిపారు. సిరియాలో దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా మరణించారు. సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇదిలా ఉంటే సిరియా సంక్షోభంపై పలు దేశాలు స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో తమ దేశం జోక్యం చేసుకోబోదని అమెరికా కాబో యే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)స్పష్టం చేశారు. రష్యా మాత్రం తిరుగుబాటుదారుల దాడులను తీవ్రంగా ఖండిచింది. అసద్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. మరోవైపు సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. హయాత్ తహరీర్ అల్-షామ్(హెచ్‌టీఎస్) నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌పై పట్టు బిగించిన నేపథ్యంలో అసద్ కుటుంబంతో సహా నగరాన్ని వీడి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
![ehatv ehatv](/images/authorplaceholder.jpg?type=1&v=2)