నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu).. అవకాశవాదంలో ఈయనను మించిన వారు లేరని చెబుతుంటారు ప్రత్యర్థులు. ఏరుదాటే దాక ఓడ మల్లయ్య. దాటిన తర్వాత బోడి మల్లయ్య అనే టైప్‌. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పార్టీ విధానాలకు భిన్నంగా పోతుంటారు. నాలుగు ఓట్లు వస్తే చాలనుకుంటారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయనకు ఆకస్మాత్తుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గుర్తుకొచ్చారు.

నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu).. అవకాశవాదంలో ఈయనను మించిన వారు లేరని చెబుతుంటారు ప్రత్యర్థులు. ఏరుదాటే దాక ఓడ మల్లయ్య. దాటిన తర్వాత బోడి మల్లయ్య అనే టైప్‌. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పార్టీ విధానాలకు భిన్నంగా పోతుంటారు. నాలుగు ఓట్లు వస్తే చాలనుకుంటారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయనకు ఆకస్మాత్తుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గుర్తుకొచ్చారు. ఇది ఎన్నికల(Elections) వరకే. ఎన్నికల తర్వాత పదవులు, పోస్టులు అన్ని తన కులం వారికి ఇచ్చుకుంటారు. లేదా ఆర్ధికపరిపుష్టి ఉన్నవారికి కట్టబెడతారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని అప్పట్లో కేంద్రానికి లేఖ రాసిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు బీసీలకు జై కొట్టడం విడ్డూరం. నాయీ బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తా,మత్స్యకారులకు తాట తీస్తానంటూ చంద్రబాబు కసురుకున్న దృశ్యాలు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో మనకు కనిపిస్తాయి.ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ(TDP) ప్ర‌క‌టించిన 94 మంది అభ్యర్థులలో బీసీలకు దక్కిన సీట్లు కేవలం 18 మాత్రమే. అదే కమ్మ సామాజికవర్గానికి 21 సీట్లు ఇచ్చారు చంద్రబాబు. జ‌న‌సేన(Janasena) ప్ర‌క‌టించిన అయిదుగురి జాబితాలో బీసీల‌కు ఇచ్చింది ఒక్కటంటే ఒక్కటి. అలాంటి ఈ రెండు పార్టీలు కలిసి జ‌య‌జయహో బీసీ అంటూ నాటకాలు ఆడుతున్నాయి. అదే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YCP CM Jagan) అయితే స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 34 శాతం పదవులు కేటాయిస్తూ 2019, డిసెంబర్‌ 28వ తేదీన జీవో జారీ చేశారు. వారికి పదవుల్లో చట్టబద్ధమైన వాటా ఇచ్చారు. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకుడు బిర్రు ప్రతాప్‌రెడ్డి(Birru Prathap Reddy) సుప్రీంకోర్టుకు(Supreme Court) వెళ్లిన విషయం తెలిసిందే! ఈ కారణంగానే జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సుప్రీం కోర్టు నిలిపివేసింది. అయితేనేం బీసీలకు జగన్‌ ప్రభుత్వం చేసినంతగా ఏ ప్రభుత్వమూ చేయలేదు. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదని, బీసీలంటే దేశానికి బ్యాక్‌ బోన్‌ అని జగన్‌ ప్రకటించారు. డీబీటీ (నగదు బదిలీ) ద్వారా 1.15 లక్షల కోట్ల రూపాయలు బీసీల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నగదేతర బదిలీ ద్వారా 50,321.88 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర బీసీలకు ప్రయోజనం చేకూర్చారు. చంద్రబాబు క్యాబినెట్‌లో ఎనిమిది మంది బీసీ మంత్రులు ఉంటే జగన్‌ ప్రభుత్వంలో 11 మంది బీసీ మంత్రులున్నారు. బాబు హయాంలో ఒక్కరంటే ఒక్క బీసీకి కూడా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు. అదే జగన్ నలుగురుని రాజ్యసభకు పంపించారు. అప్పుడు స్పీకర్‌ పదవిని కూడా చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన కోడెల శివప్రసాద్‌కు ఇచ్చారు. జగన్‌ మాత్రం తమ్మినేని సీతారాంకు ఆ పదవి ఇచ్చారు. అంతేనా 30 మందికి ఎమ్మెల్యే పదవులు, 19 మందికి ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్‌ పదవులు 56 మందికి ఇచ్చారు జగన్‌. ఇప్పుడు తొమ్మిది మంది బీసీలు మేయర్లుగా ఉన్నారు. 98 మంది బీసీలు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లుగా ఉన్నారు. తొమ్మిది మంది బీసీలు జడ్పీ చైర్‌పర్సన్‌లుగా ఉన్నారు. 215 మంది జడ్పీటీసీలు ఉన్నారు

Updated On 6 March 2024 3:39 AM GMT
Ehatv

Ehatv

Next Story