Carly Sare : 60 మందితో పెళ్లి!

కార్లీ సారే పెళ్లిళ్లు, శుభకార్యాల ఫోటోలు తీస్తుంటుంది. ఎన్నో పెళ్లిళ్లలో ఫోటోలు తీసిన ఈమెకు 40 ఏళ్లు ఉంటాయి. అన్నేసి పెళ్లిళ్లను చూసిన ఆమె వైవాహిక జీవితంపై ఓ అవగాహన ఏర్పరచుకుంది. తనకూ పెళ్లి చేసుకునే టైమ్‌ వచ్చేసరికి ఆమె ఏకంగా 60 మందిని పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే కార్లీ సారే(Carly Sare) 60 మందిని వివాహమాడింది(Marriage). ఈ 60 మంది అపరిచితులేం కాదు. కార్లీ ఫ్రెండ్సే! ఆమెకు పెళ్లి అనే కాన్సెప్టే నచ్చదు. చాలా మంది తమ జీవితాలను ఒక వ్యక్తికే అంకితం చేయడం, అతడితోనో, లేదూ ఆమెతోనో ఉండం కార్లీకి అస్సలు ఇష్టం లేదు. ఒకరి కంటే ఎక్కువ మందితో కలిసి జీవించాలని, ఎక్కువ మంది భాగస్వాములతో ఉండాలని ఆమె అనుకునేది. ఇందులో జెండర్‌తో సంబంధం లేదు. ఆమె పెళ్లి చేసుకున్న 60 మందిలో కొందరు మహిళలు కూడా ఉండటం విశేషం. 60 మందిని పెళ్లి చేసుకున్న కార్లీని చాలామంది విచిత్రంగా, వింతగా చూడటం మొదలు పెట్టారు. అయితే కార్లీ మాత్రం లైట్‌గా తీసుకుంది. ఎవరెన్ని కామెంట్లు చేసినా పట్టించుకోలేదు. ఇతరుల గురించి కాకుండా తన గురించి, తన ఆనందం గురించి మాత్రమే బతకాలనుకునే మనస్తత్వం కార్లీది. పెళ్లిళ్లలో ఆమె రంగురంగుల దుస్తులు ధరించింది. 60 మందితో కలిసి వేడుక చేసుకుంది. తన స్నేహితులను పెళ్లి చేసుకోవడమన్నది తను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయమని చెప్పుకొచ్చింది.

Eha Tv

Eha Tv

Next Story