కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, అతని భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో విడిపోతున్నట్లు ప్రకటించారు. త‌ద్వారా వీరు 18 సంవత్సరాల వివాహబంధానికి ముగింపు ప‌లికారు. "చాలా అర్థవంతమైన, కష్టమైన సంభాషణల" తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రకటనల ద్వారా ఇరువురు వెల్ల‌డించారు.

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(Canada PM Justin Trudeau), అతని భార్య సోఫీ గ్రెగోయిర్(Sophie Gregoire)ట్రూడో విడిపోతున్నట్లు ప్రకటించారు. త‌ద్వారా వీరు 18 సంవత్సరాల వివాహబంధానికి ముగింపు ప‌లికారు. "చాలా అర్థవంతమైన, కష్టమైన సంభాషణల" తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రకటనల ద్వారా ఇరువురు వెల్ల‌డించారు. చట్టపరమైన విడాకుల‌(Divorce) ఒప్పందంపై ఇద్దరూ సంతకాలు చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) నుండి వెలువ‌డిన ఓ ప్రకటన పేర్కొంది. మేము సన్నిహిత కుటుంబంగా ఉంటాం. సోఫీ, ప్రధాన మంత్రి ట్రూడో తమ పిల్లలను సురక్షితమైన, ప్రేమపూర్వక, సహకార వాతావరణంలో పెంచడంపై దృష్టి సారించారు" అని ప్రకటనలో పేర్కొన్నారు. త‌మ‌ నిర్ణ‌యాన్ని గౌరవించాలని లేఖ‌లో అభ్యర్థించారు.

జస్టిన్ ట్రూడో, సోఫీ గ్రెగోయిర్ జంట 2005లో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు, 15 ఏళ్ల జేవియర్(Xavier), 14 ఏళ్ల ఎల్లా-గ్రేస్(Ella-Grace), 9 ఏళ్ల హాడ్రియన్(Hadrien) ఉన్నారు. ఇదిలావుంటే.. పదవిలో ఉన్నప్పుడు విడిపోతున్నట్లు ప్రకటించిన రెండవ ప్రధానమంత్రిగా ట్రూడో నిలిచారు. అతని తండ్రి పియరీ ట్రూడో(Pierre Trudeau), 1979లో భార్య మార్గరెట్(Margaret) నుండి విడిపోయారు. ఇద్దరూ 1984లో విడాకులు తీసుకున్నారు. పియరీ ట్రూడో 1968 నుండి 1979 వరకు.. 1980 నుండి 1984 వరకు కెనడా(Canada) 15వ ప్రధాన మంత్రిగా పనిచేశారు.

Updated On 2 Aug 2023 8:23 PM GMT
Yagnik

Yagnik

Next Story