సినీ ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ఎంతో మంది నటులు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం సహజం .కానీ తన అభిమాన సింగర్ లా కనిపించాలనుకొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు కెనడియన్ నటుడు సెయింట్ వాన్ కొలూచి(Saint Von Colucci), BTS గాయకుడు జిమిన్ మీద మితిమీరిన అభిమానంతో (BTS member Jimin)జిమిన్ లాగా కనిపించడానికి 12 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు, వరుస సర్జరీలతో ఏర్పడిన ఇన్ఫెక్షన్స్ కారణంగా ,నటుడు కొన్ని నెలల క్రితం కాస్మెటిక్ చికిత్సల వల్ల సమస్యలతో బాధపడుతూ దక్షిణ కొరియా(south Korea) ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు . చికిత్స పొందుతూ ఏప్రిల్ 23 న కొలూచి మరణించాడు .అతని వయస్సు 22 సంవత్సరాలు .

నవంబర్ 2022లో అతను తన దవడలో అమర్చిన ఇంప్లాంట్‌లను తొలగించుకోవటానికి శనివారం రాత్రి శస్త్రచికిత్సకు వెళ్లినట్లు అతని సహచరుడు తెలియజేసారు . అయితే, శస్త్రచికిత్స తర్వాత, పెరిగిన ఇన్‌ఫెక్షన్‌ వలన ఇంట్యూబేట్ చేయవలసి వచ్చింది. అలా జరిగిన కొద్దీ గంటల్లోనే సెయింట్ వాన్ (Saint Von)మరణించాడు . గత ఏడాది, సెయింట్ వాన్ 12 సర్జరీల కోసం $220,000 అంటే దాదాపు 2కోట్లు ఖర్చు పెట్టాడు . నోస్ జాబ్, ఫేస్‌లిఫ్ట్, కనుబొమ్మ లిఫ్ట్, ఐ లిఫ్ట్ ఇంకా లిప్ రిడక్షన్ సర్జెరీల కోసం ఎంతో డబ్బుని ఖర్చుపెట్టాడు .

సెయింట్ వాన్(Saint Von) సంగీత పరిశ్రమలో కెరీర్ కోసం 2019లో కెనడా నుండి దక్షిణ కొరియాకు వెళ్లారు. తన ముఖం వెడల్పుగా ఉందని చాలా మంది కొరియన్ల లాగా తాను కనిపించాలంటూ V-ఆకారం కావాలని అనుకున్నాడు. అతను తన ముఖం గురించి చాలా అయిష్టంగా ఉండేవాడు అని దానికోసం ఎంత ఖర్చుపెట్టి అయిన సరే తన రూపాన్ని మార్చుకోవాలి అనుకున్నాడు . అతనికి దక్షిణ కొరియాలో ఉద్యోగం సంపాదించటం కోసం చాలా కష్టపడ్డాడు .

ఇండస్ట్రీలో అవకాశం కోసం 2019లో దక్షిణ కొరియాకు చేరుకున్న తర్వాత, సెయింట్ వాన్( Saint Von)కష్టపడి పాప్ ఇండస్ట్రీ లో ఎలా అయిన పేరుతెచ్చుకోవాలని ఆశపడ్డాడు . సెయింట్ వాన్ గత సంవత్సరం జూన్‌లో కొరియన్ డ్రామా(Korean Drama), ప్రెట్టీ లైస్(Pretty Lies) షూటింగ్ ని డిసెంబర్‌లో పూర్తి చేశాడు .అందులో అతను లీడ్ రోల్ అయిన అంతర్జాతీయ విద్యార్థిగా నటించాడు. ఎనిమిది ఎపిసోడ్‌లను పూర్తిచేసుకున్న ఈ సిరీస్ అక్టోబర్‌లో US స్ట్రీమింగ్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుందని సమాచారం . చక్కని రూపం దేహదారుఢ్యం కలిగి ఉన్నప్పటికీ కొరియన్ సింగర్ ని పోలి ఉండాలని చేసిన ప్రయత్నాల్లో సెయింట్ వాన్ (Saint Von)అతి చిన్న వయసులో ప్రాణాలను కోల్పోవటం ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది .

Updated On 26 April 2023 1:18 AM GMT
rj sanju

rj sanju

Next Story