కెనడాను(Canada) పర్యటించి వద్దామనుకుంటున్న ఇండియన్స్‌కు(Indians) ఇప్పుడు ఒకింత కష్టమే!

కెనడాను(Canada) పర్యటించి వద్దామనుకుంటున్న ఇండియన్స్‌కు(Indians) ఇప్పుడు ఒకింత కష్టమే! ఎందుకంటే భారతీయులకు ఇచ్చే టూరిస్ట్‌ వీసాల(Tourist Visa) సంఖ్యను కెనడా భారీగా తగ్గించింది. ఇంతకు ముందు టూరిస్ట్‌ వీసాల కోసం అప్లై చేసుకున్న ప్రతి వంద మంది భారతీయులలో 80 మంది వరకు వీసాలు లభించేవి. ఇప్పుడా సక్సెస్‌ రేటు 20 శాతానికంటే తక్కువకు పడిపోయింది. ముఖ్యంగా పంజాబ్‌(Punjab) నుంచి పర్యాటక వీసాల కోసం వచ్చే దరఖాస్తులను కెనడా పెద్ద సంఖ్యలో తిరస్కరిస్తున్నది. అర్హత గల దరఖాస్తుదారులకు ఇచ్చే పదేళ్ల ఆటోమ్యాటిక్‌ మల్టిపుల్‌-ఎంట్రీ టూరిస్ట్‌ వీసాలను నిలిపివేయడానికి కొన్ని నెలల ముందు నుంచి కెనడా ఇలా చేస్తున్నది. ఆ విధంగా పర్యాటకులకు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నది. కెనడా ఇమ్మిగ్రేషన్‌ విధానాలు కఠినతరం అవుతున్నట్టు ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. భారత- కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరిగినమాట వాస్తమే అయినా ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు భారతీయులకు కెనడా ఇమ్మిగరేషన్‌, శరణార్థి, పౌరసత్వ విభాగం ఐఆర్‌సీసీ (ఇమ్మిగ్రేషన్‌, రెఫ్యూజీస్‌ అండ్‌ సిటిజన్‌షిప్‌ కెనడా) 3,65,750 పర్యాటక వీసాలను జారీ చేసింది. ఇవి నిరుడు ఇదే సమయంలో మంజూరైన వీసాల కంటే 20,119 అధికం. కానీ తర్వాతే పరిస్థితి తారుమారయ్యింది. ఈ ఏడాది జూలై-ఆగస్టు నుంచి భారతీయుల వీసా సక్సెస్‌ రేటు బాగా పడిపోయింది. నిబంధనలు కఠినతరమవడంతో బాగా డబ్బున్న వారి వీసాలు కూడా రిజెక్ట్ అవుతున్నాయి. లక్షల రూపాయల జీతం ఉన్నవారికి, హై ప్రొఫైల్‌ వ్యక్తులకు కూడా వీసా దొరకకపోవడం గమనార్హం.

Eha Tv

Eha Tv

Next Story