Canada Funerals Cost : అక్కడ అంత్యక్రియలు జరపడం చచ్చేంత చావుకొస్తోంది...!
స్వతంత్ర దేశంలో చావు(Death) కూడా పెళ్లిలాంటిదే(Marriage) బ్రదర్ అన్నారు ఆత్రేయ(Athreya) ఓ సినిమా పాటలో.. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ చావు కూడా ఖర్చుతో కూడిన వ్యవహారమే అయ్యింది. మన దగ్గరే కాదు, కెనడాలో(Canada) కూడా ఇదే పరిస్థితి. ఆత్మీయులు చనిపోతే అంత్యక్రియలు(Funeral) జరపడానికి భయపడుతున్నారు బంధువులు. కెనడాలో కొన్ని కుటుంబాలు అయినవారి మృతదేహాలను(Dead bodies) అనాథ శవాలుగా వదిలేసి వెళ్లిపోతున్నారు.
స్వతంత్ర దేశంలో చావు(Death) కూడా పెళ్లిలాంటిదే(Marriage) బ్రదర్ అన్నారు ఆత్రేయ(Athreya) ఓ సినిమా పాటలో.. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో కానీ చావు కూడా ఖర్చుతో కూడిన వ్యవహారమే అయ్యింది. మన దగ్గరే కాదు, కెనడాలో(Canada) కూడా ఇదే పరిస్థితి. ఆత్మీయులు చనిపోతే అంత్యక్రియలు(Funeral) జరపడానికి భయపడుతున్నారు బంధువులు. కెనడాలో కొన్ని కుటుంబాలు అయినవారి మృతదేహాలను(Dead bodies) అనాథ శవాలుగా వదిలేసి వెళ్లిపోతున్నారు. అంత్యక్రియలను గౌరవంగా జరిపించే అవకాశం కూడా లేదక్కడ. అంత్యక్రియల ఖర్చు అక్కడ భారీగా పెరిగింది. మృతులు తమవారేనని తెలిసినా మృతదేహాలను తీసుకోవడానికి వెనకాముందు అవుతున్నారు. కెనడాలోని అన్ని ప్రావిన్సులలో అనాథ మృతదేహల సంఖ్య పెరగడానికి ఇదే కారణం. కెనడాలోని అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ మృతదేహాలను గుర్తిస్తే దశాబ్దం తర్వాత, అంటే 2023లో ఆ సంఖ్య 1,183 చేరుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మృతుల దగ్గర ఉన్న ఆధారాలతో కుటుంబసభ్యులను గుర్తిస్తే కొందరు మృతదేహాలను తీసుకెళ్లారు కానీ 24 శాతం మృతదేహాలను ఎవరూ తీసుకెళ్లలేదు. మృతదేహాల ఖననానికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తున్నది. గ్రేటర్ టొరంటో నగరంలో అంత్యక్రియలకు అయ్యే ఖర్చు 34 వేల డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే 27 లక్షల రూపాయలు. ఇక వ్యాన్, ఇతర ఖర్చులకు మరో మూడు లక్షలు చెల్లించాలి. మొత్తంమీద ఓ 30 లక్షలు ఖర్చు అవుతున్నది. భరించేవారు భరిస్తున్నారు. లేనివారు మృతదేహలను వదిలేసి వెళుతున్నారు.