ఇప్పుడు మనం కడుతున్న పన్నులే(Tax) వాచిపోతున్నాయి. ఇంటిటాక్స్‌, ఇన్‌కమ్‌టాక్స్‌, టోల్‌ టాక్స్‌ ఇలా లెక్కలేనన్ని టాక్సులు కడుతున్నాం! వీటిని కట్టలేక ఆపసోపాలు పడుతున్నాం. వీటికి తోడు నిత్యావసర వస్తువులపై కడుతున్న టాక్స్‌ ఒకటి! రాబోయే రోజుల్లో పీల్చుకునే గాలికి కూడా టాక్స్‌ కట్టాల్సి వస్తుందేమో! రాబోయే రోజులేమిటి? కెనడాలో(Canada) ఇలాంటి టాక్స్‌ ఒకటి ఆల్‌రెడీ వచ్చేసింది. వచ్చే నెల నుంచి కెనడాలో రెయిన్‌ టాక్స్‌(Rain Tax) అమలు కానుంది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదు.

ఇప్పుడు మనం కడుతున్న పన్నులే(Tax) వాచిపోతున్నాయి. ఇంటిటాక్స్‌, ఇన్‌కమ్‌టాక్స్‌, టోల్‌ టాక్స్‌ ఇలా లెక్కలేనన్ని టాక్సులు కడుతున్నాం! వీటిని కట్టలేక ఆపసోపాలు పడుతున్నాం. వీటికి తోడు నిత్యావసర వస్తువులపై కడుతున్న టాక్స్‌ ఒకటి! రాబోయే రోజుల్లో పీల్చుకునే గాలికి కూడా టాక్స్‌ కట్టాల్సి వస్తుందేమో! రాబోయే రోజులేమిటి? కెనడాలో(Canada) ఇలాంటి టాక్స్‌ ఒకటి ఆల్‌రెడీ వచ్చేసింది. వచ్చే నెల నుంచి కెనడాలో రెయిన్‌ టాక్స్‌(Rain Tax) అమలు కానుంది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదు. మొట్టమొదటిసారిగా వర్షానికి పన్ను వేసిన దేశంగా కెనడా నిలిచిపోతుంది. ప్రకృతి ప్రసాదించే వర్షంపై కెనడా ప్రభుత్వం ఎందుకు పన్ను వేయాలనుకుంటున్నదంటే.. దానికో కథ ఉంది. కెనడాలో మార్చి నుంచి మే మాసం వరకు వర్షంతో పాటు మంచు కురుస్తుంది.
వాన నీటిలో చాలా భాగం చెట్లు, మొక్కలు పీల్చుకుంటాయి. కొంత నీరు భూమిలో ఇంకిపోతుంది. కాగా మిగిలిన వర్షపు నీరు అంతా రోడ్డుపై ప్రవహిస్తుంటుంది. కెనడాలో నేల కనిపించడం కష్టం. అంతా కాంక్రీటుమయమే! అందుకే నీట నిర్వహణ ఆ ప్రభుత్వానికి కష్టంగా మారుతోంది. కెనడాలో తుఫాన్లు కూడా ఎక్కువే! తుఫాన్‌ వచ్చినప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంటుంది. ప్రజల రోజువారీ కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. నీటి వినియోగదారులు, ఆసక్తిగల పార్టీల సహకారం, ఎన్‌జీఓల చేయూతతో స్మార్ట్‌ వాటర్ ఛార్జ్, వాటర్ సర్వీస్ ఛార్జ్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మరి దీనికి నిధులు కావాలిగా! వాటి కోసమే రెయిన్‌ట్యాక్స్‌ అన్నమాట! కెనడాలో ఎక్కువగా రాతినేలలే ఉంటాయి. అందుకే వర్షపు నీరు నేలలో ఇంకడానికి చాలా సమయం పడుతుంది. చిన్నపాటి వర్షం పడ్డా నాలాలు పొంగిపొర్లుతుంటాయి. ఈ సమస్యను రన్‌ఆఫ్ అంటారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మురుగునీటి పారుదల వ్యవస్థ స్మార్ట్‌ వాటర్ ఛార్జ్‌ను ప్రారంభించింది. దీనికి అయ్యే ఖర్చులను రెయిన్‌ట్యాక్స్‌ ద్వారా వసూలు చేస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Updated On 29 March 2024 12:40 AM GMT
Ehatv

Ehatv

Next Story