Titanic tourist submersible : టైటాన్‌లో ప్రాణవాయువు తరుగుతోంది.. యాత్రికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది...
అట్లాంటిక్ మహా సముద్రంలో(Atlantic Sea) మునిగిన టైటానిక్ నౌక(Titanic Ship) అవశేషాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి(Mini Submarine) కనిపించకుండా పోయింది. ఆ సబ్‌మెరిన్‌లో కొన్ని గంటలకు సరిపడిన ఆక్సిజన్ మాత్రమే ఉంది. గంటలు గడిచిపోతున్నాయి. ఇప్పటికే రెండు రోజులు గడిచాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆందోళన పెరుగుతోంది. గల్లంతైన సబ్‌మెరిన్‌ను కనుగొనేందుకు ఆల్‌రెడీ అమెరికా(america), కెనడా(Canada) రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి. అందులో ఉన్న అయిదుగురు సభ్యుల పరిస్థితి ఏమిటో ఇప్పటి వరకు తెలియరాలేదు.
అట్లాంటిక్ మహా సముద్రంలో(Atlantic Sea) మునిగిన టైటానిక్ నౌక(Titanic Ship) అవశేషాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి(Mini Submarine) కనిపించకుండా పోయింది. ఆ సబ్‌మెరిన్‌లో కొన్ని గంటలకు సరిపడిన ఆక్సిజన్ మాత్రమే ఉంది. గంటలు గడిచిపోతున్నాయి. ఇప్పటికే రెండు రోజులు గడిచాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆందోళన పెరుగుతోంది. గల్లంతైన సబ్‌మెరిన్‌ను కనుగొనేందుకు ఆల్‌రెడీ అమెరికా(america), కెనడా(Canada) రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి. అందులో ఉన్న అయిదుగురు సభ్యుల పరిస్థితి ఏమిటో ఇప్పటి వరకు తెలియరాలేదు.
అట్లాంటిక్ మహాసముద్రపు లోతుల్లో రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) జరుగుతోంది. రెండు మైళ్ల కంటే ఎక్కువ లోతులో, 20 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కడని వెతుకుతారు? చుట్టూ చిమ్మ చీకటి, ఎదురుగా ఏముందో కనిపించని పరిస్థితి. మరోవైపు గడ్డకట్టించే చలి. సబ్ మెరిన్‌ను ఎలా వెతకడం? అయిదుగురి ప్రాణాలను ఎలా రక్షించడం? సంక్లిష్టమే అయినా రెస్క్యూ సిబ్బంది శ్రమ ఫలించాలని అందరూ కోరుకుంటున్నారు.
బ్రిటన్‌కు(Britain) చెందిన వ్యాపారవేత్త, సాహసయాత్రికుడు హమీష్ హార్డింగ్(Hamish Harding), పాకిస్తాన్‌కు(Pakisthan) చెందిన బిలియనీర్ షాజాదా దావూద్(Shahzada Dawood), అతడి కుమారుడు సులేమాన్(Suleman), ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రషన్(Stockton Rush), ఫ్రాన్స్‌కు(france) చెందిన పైలట్ పౌల్‌హెన్రీ నార్జియోలెట్(Paul-Henri Norgiolet) ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. ఓషన్‌గేట్ అనే సంస్థ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రలో వీరంతా పాల్గొన్నారు. ఈ యాత్రలో టైటానిక్ శకలాల సందర్శన ఓ భాగం.
ఇందుకోసం 22 అడుగుల పొడవైన మినీ సబ్‌మెరిన్‌ను వాడారు. దీని పేరు టైటాన్. ఒక్కో టికెట్ రేటు రెండున్నర లక్షల డాలర్లు. 400 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న టైటానిక్ శకలాల దగ్గరకు వెళ్లి రావాలి. భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటలకు న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్ జాన్స్కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో ఆ మహాసాగరంలోకి ప్రవేశించింది టైటాన్. మొదటి రెండు గంటల పాటు ప్రయాణం బాగానే సాగింది. తర్వాత దీనికి సపోర్టింగ్ షిప్‌గా వచ్చిన పోలార్ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి.
ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. ఈ సబ్‌మెరిన్ పై భాగాన్ని కార్బన్ ఫైబర్‌తో రూపొందించారు. మాములుగా అయితే సబ్‌మెరిన్‌లు సొంతంగా రేవు నుంచి బయలుదేరి, సొంతంగానే తిరిగి చేరుకోగలవు. సబ్‌మెర్సిబుల్‌గా పేర్కొనే ఈ మినీ సబ్‌మెరిన్‌కు మాత్రం సముద్రంలో పంపడానికి, మళ్లీ వెలికి తీయడానికి ఓ నౌక అవసరం. ఇందుకోసం కెనడాకు చెందిన పోలార్ ప్రిన్స్ అనే షిప్ సేవలను ఓషన్‌గేట్ సంస్థ వాడుకుంది. గంటా 45 నిమిషాల్లోనే మినీ సబ్‌మెరిన్‌తో పొలార్ ప్రిన్స్‌కు సంబంధాలు తెగిపోయాయి.
111 ఏళ్ల కిందట టైటానిక్ నౌక మంచుకొండను ఢీకొట్టి అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 2,200 మంది ప్రయాణికులు, 700 మంది సిబ్బంది ప్రాణాలు విడిచారు. టైటానిక్ శకలాలను 1985లో మొదటిసారి గుర్తించారు. ఆ శకలాలను చూసేందుకు 2021లో కొందరు పర్యాటకులు ఇదే టైటాన్‌లో లక్ష నుంచి లక్షన్నర డాలర్లు చెల్లించి సముద్ర గర్భంలోకి వెళ్లారు. ఆ తర్వాత టైటాన్ ఇలాంటి యాత్రలను చేపట్టింది కానీ ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని ఓషన్‌గేట్ సంస్థ చెప్పుకుంటోంది. ఓషన్‌గేట్ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని కొందరు విమర్శిస్తున్నారు.