విడాకులు(Divorce) పుచ్చుకున్న తర్వాత పెళ్లి(Marriage) తాలుకూ పాత గుర్తులను చెరిపేసుకోవాలి. గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదనుకోకుండా గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది పెళ్లి అల్బమ్‌.(Photo Album) అది వెంట ఉండేంత వరకు బాధే! మరి ఆ ఫోటోలను ఏం చేయాలి? ఏముంది... సింపుల్(Simple) ..చించి అవతలపారేయ్యడమే! కానీ విడాకులు తీసుకున్న చాలామందికి తమ పెళ్లి ఫొటో హార్డ్‌ కాపీలను చించేయడానికో, కాల్చేయడానికో సెంటిమెంట్‌(Sentiment) అడ్డొస్తుంటుంది.

విడాకులు(Divorce) పుచ్చుకున్న తర్వాత పెళ్లి(Marriage) తాలుకూ పాత గుర్తులను చెరిపేసుకోవాలి. గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదనుకోకుండా గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది పెళ్లి అల్బమ్‌.(Photo Album) అది వెంట ఉండేంత వరకు బాధే! మరి ఆ ఫోటోలను ఏం చేయాలి? ఏముంది... సింపుల్(Simple) ..చించి అవతలపారేయ్యడమే! కానీ విడాకులు తీసుకున్న చాలామందికి తమ పెళ్లి ఫొటో హార్డ్‌ కాపీలను చించేయడానికో, కాల్చేయడానికో సెంటిమెంట్‌(Sentiment) అడ్డొస్తుంటుంది. యాస్‌టీజ్‌గా బయటపడేస్తే మిస్‌ యూజ్‌(Misuse) అవుతుందన్న భయం! వాటిని అవతలపారెయ్యనూ లేక.. ఇంట్లో పెట్టుకోనూ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారి కోసం రష్యాలో(Russia) ఓ స్టూడియో వెలిసింది. ఆ స్టూడియోను లియు బైలు అనే వ్యాపారి ఏర్పాటుచేశాడు. వెడ్డింగ్‌ ఫోటోస్‌(Wedding photos) ఫ్రెడింగ్‌ బిజినెస్‌ అనే పేరిట వెలిసిన ఆ స్టూడియోకు మాజీ దంపతులు పరుగులు పెడుతున్నారు. విడాకులు పుచ్చుకున్న వారు తమ పెళ్లి ఫొటోలను ఈ స్టూడియోకి తెచ్చిస్తే.. ఫోటోలను స్ప్రే పెయింట్‌తో(Spray painting) కప్పేసి, వాటిని ష్రెడింగ్‌ మెషిన్‌లో వేసి నుజ్జు నుజ్జు చేసేస్తాడట! ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి ఆ ఫుటేజ్‌ను(Footage) క్లయింట్‌కు పంపుతాడు. వీడియో చూసిన వారికి అదో తుత్తి! మొత్తం మీద ఇతగాడి బిజినెస్‌ ఇప్పుడు బ్రహ్మండంగా సాగుతోంది.

Updated On 12 Dec 2023 2:39 AM GMT
Ehatv

Ehatv

Next Story