Bushra Bibi : జైల్లో ఉన్న ఇమ్రాన్‌ను తొలిసారి కలిసిన భార్య.. దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడంటూ..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అత్యంత భద్రతతో కూడిన అటాక్ జైలులో ఉంచారు. అవినీతి కేసులో అరెస్టయి శిక్ష పడిన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన భార్య బుష్రా బీబీ తొలిసారి గురువారం కలిశారు. సోమవారం న్యాయవాది నయీమ్ హైదర్ పంజోతా ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pakistan EX PM Imran Khan)ను అత్యంత భద్రతతో కూడిన అటాక్ జైలు(Attack Jail)లో ఉంచారు. అవినీతి కేసులో అరెస్టయి శిక్ష పడిన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన భార్య బుష్రా బీబీ(Bushra Bibi) తొలిసారి గురువారం కలిశారు. సోమవారం న్యాయవాది నయీమ్ హైదర్ పంజోతా(Hyder Panjotha) ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు.
ఖాన్ తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంజోథా మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య దాదాపు అరగంట పాటు మాట్లాడుకున్నారని తెలిపారు. సమావేశం అనంతరం బుష్రా మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని.. అయితే ఆయనను సి కేటగిరీలో ఉంచారని చెప్పారు. హైకోర్టు ఆదేశించినా న్యాయవాద బృందం సమావేశానికి అనుమతి లేదన్నారు. దీనిపై రేపు హైకోర్టులో విచారణ చేపడతామన్నారు. ఇమ్రాన్ భార్య బుష్రా కూడా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఇస్లామాబాద్ హైకోర్టు(Islamabad High Court) ఆదేశాలను అనుసరించి.. జైలు అధికారులు సోమవారం ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన న్యాయవాది పంజోథాను కలవడానికి అనుమతించారు. ఇమ్రాన్ ఖాన్ చాలా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని సమావేశం అనంతరం పంజోథా చెప్పారు. బహిరంగ మరుగుదొడ్డితో చీకటి గదిలో ఉంచారు. ఇది కాకుండా పగటిపూట ఈగలు తిరుగుతూ ఉంటాయి. రాత్రి చీమలు వస్తాయి. ఆయన తీవ్రవాది అన్నట్లుగా ఆయనను కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని అన్నారు.
అరెస్ట్ వారెంట్‌ను పోలీసులు తనకు చూపించలేదని ఇమ్రాన్ ఖాన్ తనతో చెప్పాడని తెలిపారు. దీంతో పాటు లాహోర్‌లోని ఆయన భార్య గది తలుపులు కూడా పగులగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. శిక్షకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేసినందుకు పత్రంపై సంతకం కోసం పంజోథా.. ఇమ్రాన్‌ను జైలులో కలిశారు. ఒక అధికారి సమక్షంలో సుమారు గంట 45 నిమిషాల పాటు ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశమయ్యాడు.
తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్‌లోని దిగువ కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించడంతో ఇమ్రాన్ ఖాన్‌ను శనివారం లాహోర్(Lahore)లోని ఆయన ఇంటి నుండి అరెస్టు చేశారు. ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఆయనను రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని కోర్టు ఆదేశించినప్పటికీ.. పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జైలులో ఉంచారు.