పచ్చబొట్టు కొందరికి సరదా! ఇష్టంగా పొడిపించుకుంటుంటారు. ఇప్పుడు వీటినే టాటూలంటున్నారు. ఏదో ముచ్చటపడి చేతిపైనో భుజంపైనో టాటూలు వేసుకుంటే బాగుంటుంది కానీ, శరీరమంతా పచ్చబొట్లు పొడిపించుకుంటే అసహ్యంగా ఉంటుంది. బ్రిటన్‌(Britain)కు చెందిన మెలిస్స స్టోన్‌ పిచ్చిపట్టినట్టు ఒళ్లంతా టాటూలతో నింపేసుకుంది. ఆ టాటూల కారణంగా ఎక్కడెళ్లినా చీదరింపులు ఎదరవుతున్నాయి. ఉద్యోగం కూడా దొరకడం లేదట పాపం!

పచ్చబొట్టు కొందరికి సరదా! ఇష్టంగా పొడిపించుకుంటుంటారు. ఇప్పుడు వీటినే టాటూలంటున్నారు. ఏదో ముచ్చటపడి చేతిపైనో భుజంపైనో టాటూలు వేసుకుంటే బాగుంటుంది కానీ, శరీరమంతా పచ్చబొట్లు పొడిపించుకుంటే అసహ్యంగా ఉంటుంది. బ్రిటన్‌(Britain)కు చెందిన మెలిస్స స్లోన్‌(Melissa Sloan) పిచ్చిపట్టినట్టు ఒళ్లంతా టాటూలతో నింపేసుకుంది. ఆ టాటూల కారణంగా ఎక్కడెళ్లినా చీదరింపులు ఎదరవుతున్నాయి. ఉద్యోగం కూడా దొరకడం లేదట పాపం! 46 ఏళ్ల మెలిస్సా స్లోన్‌కు ఇంతకు ముందు కనీసం టాయిలెట్‌ క్లీనింగ్‌ జాబైనా దొరికేది. ఇప్పుడూ అదీ లేదు. అవును మరి.. ఒంటిపై 800 టాటూలు వేయించుకుంటే ఎవరు మాత్రం ఉద్యోగం ఇస్తారు? చూట్టానికి భయంకరంగా ఉంటే దగ్గరకు ఎవరైనా రానిస్తారా? 20 ఏళ్ల వయసున్నప్పటి నుంచే ఆమె టాటూలను వేయించుకోవడం మొదలెట్టిందట! మొదట్లో ప్రతి వారం రెండు నుంచి మూడు టాటూలు వేయించుకునేది.. కానీ రాన్రాను పరిస్థితి మారింది. అదో వ్యసనంగా మారిందామెకు! శరీరమంతా పచ్చబొట్లు పొడిపించుకుంది. ఆమె ఫోటో చూడండి.. ఎంత అసహ్యంగా ఉందో..! అన్నట్లు ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. టాటూల కారణంగా మేనంతా నీలిరంగులో మారిపోయిందని చెబుతున్న మెలిస్సా అవంటే తనకు ఎంతో ఇష్టమని మురిపంగా అంటోంది. ప్రపంచంలో తనకంటే ఎక్కువ టాటూలు ఎవరి శరీరంపైనా ఉండబోమని గర్వంగానూ చెబుతోంది.. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే ఇదే కాబోలు!

Updated On 6 July 2023 1:32 AM GMT
Ehatv

Ehatv

Next Story