నిద్దట్లో కలలు రావడం సహజం! కొన్ని రిజిస్టర్‌ అవుతాయి. కొన్నింటిని తెల్లారేసరికి మర్చిపోతుంటాం! పొద్దున్నే వచ్చే కలలు నిజమవుతాయంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ బ్రిటన్‌లోని ఓ మహిళకు మాత్రం కల నిజమయ్యిందట! ఆ కలే ఆమె ప్రాణాలు కాపాడింది. 46 ఏళ్ల షార్లెట్‌ వ్రో బిజినెస్‌వుమెన్‌! 2021లో ఆమెకు చిత్రమైన కల వచ్చింది.

నిద్దట్లో కలలు రావడం సహజం! కొన్ని రిజిస్టర్‌ అవుతాయి. కొన్నింటిని తెల్లారేసరికి మర్చిపోతుంటాం! పొద్దున్నే వచ్చే కలలు నిజమవుతాయంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ బ్రిటన్‌లోని ఓ మహిళకు మాత్రం కల నిజమయ్యిందట! ఆ కలే ఆమె ప్రాణాలు కాపాడింది. 46 ఏళ్ల షార్లెట్‌ వ్రో బిజినెస్‌వుమెన్‌! 2021లో ఆమెకు చిత్రమైన కల వచ్చింది. తనకు రొమ్ములో గడ్డ ఉన్నట్టు, డాక్టర్‌తో కన్సల్ట్ చేస్తున్నట్టు , ఆ డాక్టర్‌ బ్రెస్ట్‌ కేన్సర్‌ అని చెప్పినట్టు పీడకల వచ్చింది. చటుక్కున ఆమె నిద్రలేచింది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు టైమ్‌ ఉదయం నాలుగు గంటలు. తనకు వచ్చింది కలేనని ఆమెకు తెలుసు! అయినా భయంతోనే రొమ్ములను పరీక్షించుకుంది. కలలో కనిపించిన ప్రదేశంలోనే చేతికి ఓ ముద్దలా తగలడంతో భయపడింది. ఆ భయపడుతూనే డాక్టర్లను కన్సల్ట్ చేసింది. వారు స్కానింగ్‌ చేశారు. అందులో ట్రిపుల్ నెగటివ్‌ కేన్సర్‌ ఉన్నట్టు తేలింది. ఆమె కుంగిపోలేదు. భర్త, పిల్లల సహకారంతో కేన్సర్‌పై పోరాటం చేయాలనుకుంది. కీమో చేయించుకుంది. రెండేళ్ల పాటు మాస్టెక్టమీ, రేడియోథెరపీ, కీమో థెరపీలు చేయించుకుంది. 2023 వచ్చేసరికి ఆమె పూర్తిగా కోలుకుంది. పీడకల వస్తే వచ్చింది కానీ తన ప్రాణాన్ని కాపాడింది అని షార్లెట్‌ వ్రో చెబుతున్నారు. తనకు వచ్చే కలలు చాలా స్పష్టంగా ఉంటాయని, అచ్చం సినిమా చూస్తున్నట్టు ఉంటుందని తెలిపారు. ఆ కల వల్లే తాను కేన్సర్‌ను తొందరగా గుర్తించగలిగానన్నారు. లేకపోతే ఈపాటికి ప్రాణాలుపోయేవని తెలిపారు. కొంతమంది ఇది కోఇన్సిడెంట్‌ అని అంటున్నారు కానీ తనకు ఎవరో ముందస్తుగా హెచ్చరించి ఉంటారని తాను అనుకుంటున్నానని షార్లెట్‌ వ్రో తెలిపారు. వారికి జీవితాంతం కృతజ్ఞురాలైన ఉంటానని తెలిపారు. భవిష్యత్తు గురించి సమాచారం అందించే కలలను ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్ అని అంటారు.

Updated On 29 April 2024 7:09 AM GMT
Ehatv

Ehatv

Next Story