Britain news : టెంటులో నిద్రించి రూ.7 కోట్ల విరాళాలు తెచ్చాడు
మనం ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్తే... అక్కడ క్యాంప్‌ఫైర్, టెంట్స్ ఉంటే... ఒకటి లేదా రెండు రోజులు ఆ టెంట్లలో ఉండేందుకు ఇష్టపడతారు. కానీ రోజూ వాటిలోనే పడుకోవాలంటే ఇబ్బందే మరి . ఎలాంటి సదుపాయాలూ లేకుండా టెంట్లలో నిద్రపోవడం మాటలు కాదు.
మనం ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్తే... అక్కడ క్యాంప్‌ఫైర్, టెంట్స్ ఉంటే... ఒకటి లేదా రెండు రోజులు ఆ టెంట్లలో ఉండేందుకు ఇష్టపడతారు. కానీ రోజూ వాటిలోనే పడుకోవాలంటే ఇబ్బందే మరి . ఎలాంటి సదుపాయాలూ లేకుండా టెంట్లలో నిద్రపోవడం మాటలు కాదు. పెద్దవాళ్లు కూడా చేయలేని సాహసాన్ని ఓ పిల్లాడు చేసి చూపించాడు. ఏకంగా మూడేళ్లపాటూ టెంట్లలో నివసించాడు . ఆ టెంట్ లోనే నిద్ర పోయేవాడు ... ఇంతకీ ఆ పిల్లాడికి టెంట్‌లో నిద్రపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి దీని గురించి ఏంటో తెలుసుకుందాం.
బ్రిటన్ కి చెందిన మాక్స్ వూసీ తన ఇంటిపక్కనే ఉన్న రిక్ అబాట్ ఉండేవారు. ఆయన మ్యాక్స్ వుజీ కుటుంబానికి సన్నిహితుడు. అయితే ఆయన క్యాన్సర్‌తో చనిపోవడంతో మ్యాక్స్ వుజీ కొంత కలత చెందాడు. అంతకుముందే రిక్ అబాట్ మ్యాక్స్ వుజీకి ఒక టెంట్ బహుమానంగా ఇచ్చి ఏదైనా సాహసం చేయాలన్నాడు. దీంతో 2020 నుంచి మూడేళ్ల పాటు ఇంటి బయట టెంట్‌లోనే ఉంటానని బాలుడు మీడియాకు తెలిపారు. ఇంట్లోకి ఎట్టిపరిస్థితుల్లో వెళ్లబోనని కూడా బాలుడు చెప్పడంతో మ్యాక్స్ వుజీకి మీడియా అండగా నిలిచింది. బాలుడు ఉద్దేశ్యాన్ని అందరికీ తెలియచేసింది. తనకు విరాళం రూపంలో వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని బాలుడు ప్రకటించాడు.
అయితే మాక్స్ వూసీ... 2020 మార్చిలో ఈ క్యాంపెయిన్ ప్రారంభించాడు. లండన్ జూ. డౌనింగ్ స్ట్రీట్, ట్వికెన్ హామ్ రగ్బీ స్టేడియం వంటి హై-ప్రొఫైల్ లొకేషన్లలో ఆ పిల్లాడు రాత్రి వేళ టెంట్లలో పడుకున్నాడు. అసలే అక్కడ చలి ఎక్కువ. రాత్రిళ్లు మైనస్ డిగ్రీల్లో ఉంటుంది. అలాంటి చోట ఇలాంటి సాహసం చేశాడు.
మాక్స్ వూసీ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అతని కుటుంబం అస్సలు ఒప్పుకోలేదు. చాలాసార్లు ఇంటికి రప్పించేందుకు ప్రయత్నించింది. ఆరు నెలల తర్వాత పిల్లాడి ఆరోగ్యం కోసం క్యాంపెయిన్ ఆపేయమని ఒత్తిడి చేసింది. కానీ మాక్స్ పట్టుదలతో ప్రయత్నించాడు. ఇంటి వెనక గార్డెన్ నుంచి ప్రారంభించిన ఈ క్యాంపెయిన్‌లో అతను వేర్వేరు లొకేషన్లలో 14 రకాల టెంట్లలో పడుకున్నాడు. అనారోగ్యంతో ఉండే రోగుల కోసం ఓ కేర్ హోమ్ నిర్మించాలనే మంచి ఉద్దేశంతో ఆ పిల్లాడు ఇది చేపట్టాడు . దీంతో విరాళాలు వెల్లువెత్తాయి. ఏడు కోట్ల విరాళాలు ఈ మూడేళ్లలో వచ్చి పడ్డాయి. దీనిని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చేశాడు. మ్యాక్స్ వుజీని అభినందిస్తూ అనేక మంది ప్రశంసించారు. అనేక అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. మొత్తానికి ఆ పిల్లాడు అనుకున్నది సాధించాడు. పన్నేండేళ్ల వయసులో సమాజం గురించి ఆలోచించడం, పట్టుదలతో ప్రయత్నించడం గొప్ప విషయం అని అంతా మెచ్చుకుంటు ప్రశంసల జల్లు కురిపించారు.