మనకింత నిలువ నీడనిస్తూ , కడుపు నింపుకోవడానికి ఇంత తిండినిస్తూ మనల్ని కన్నబిడ్డలా సాకుతున్న భూమికి(Earth) నూకలు చెల్లిపోయే రోజులు మున్ముందున్నాయి. దాన్ని యుగాంతం అనాలో, మహా వినాశనం అని అనాలో తెలియదు కానీ భూమి నిస్సారంగా, నిర్జీవంగా, నీర్జలంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈవి కాకిలెక్కలు కావు.

మనకింత నిలువ నీడనిస్తూ , కడుపు నింపుకోవడానికి ఇంత తిండినిస్తూ మనల్ని కన్నబిడ్డలా సాకుతున్న భూమికి(Earth) నూకలు చెల్లిపోయే రోజులు మున్ముందున్నాయి. దాన్ని యుగాంతం అనాలో, మహా వినాశనం అని అనాలో తెలియదు కానీ భూమి నిస్సారంగా, నిర్జీవంగా, నీర్జలంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈవి కాకిలెక్కలు కావు. అత్యాధునిక సూపర్‌ కంప్యూటర్‌ను ఉపయోగించి మానవాళి అంతం గురించి అంచనా వేశారు శాస్త్రవేత్తలు. బ్రిటన్‌లోని బ్రిస్టల్‌ యూనివర్సిటీకి(Bristol university) చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్తు గురించి కంప్యూటర్‌ రూపొందించిన నివేదికలను స్టడీ(Report study) చేశారు. భూమి మీద మానవజాతి ఎప్పుడు అంతరించిపోతుందో తెలుసుకున్నారు. కంప్యూటర్‌ చెప్పిన దాని ప్రకారం 250 మిలియన్‌ సంవత్సరాల తర్వాత ఈ భూమ్మీద నరమానవుడు(Human beigns) ఉండడు. భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి కారణంగా మానవాళి మనుగడ దుర్భరంగా మారుతుందని పరిశోధకులు అంటున్నారు. మనుషులు పిట్టల్లా రాలిపోతారని, సమస్త జంతువులు నాశనం అవుతాయని చెబుతున్నారు. భవిష్యత్‌లో సూర్యుని నుంచి ఇప్పుడున్న దానికన్నా సుమారు రెండున్నర శాతం అధిక రేడియేషన్‌ విడుదల అవుతుంది. ఫలితంగా కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయి ఇప్పుడున్న దాని కటే రెండు రెంట్లు అధికం అవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో అగ్నిపర్వత విస్ఫోటనాలతో ఏర్పడే సూపర్ ఖండం తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలను ఆక్రమిస్తుంది. దాంతో భూమ్మీద చాలా ప్రాంతాల ఉష్ణోగ్రతలు 40 నుంచి 70 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయి. కొత్తగా ఏర్పడే సూపర్‌ఖండం మానవాళికి మూడు రెట్ల ముప్పును కలిగిస్తుంది. ఇంతకు ముందు అనుకున్నదాని కంటే ముందుగానే మానవాళి అంతం అవుతుందని పరిశోధనలో తేలింది.

Updated On 6 Nov 2023 7:20 AM GMT
Ehatv

Ehatv

Next Story