Sibelli Ferreira : ఇదెక్కడి చోద్యం? కాస్ల్రూమ్లో స్టూడెంట్లతో టీచర్ డాన్స్‌లు
మొన్నామధ్య అమెరికాలో(america) కొందరు మహిళా టీచర్లు విద్యార్థులతోనే వికృత చేష్టలు చేసి అరెస్టయ్యారు. అప్పుడు ఆ టీచర్ల ప్రవర్తన చూసి తిట్టుకున్నాం! లేటెస్ట్‌గా బ్రెజిల్‌లో(Brazil) సిబెల్లి ఫెరీరా అనే ఓ టీచర్ క్లాస్ రూమ్‌లోనే అసభ్యకరంగా డాన్స్‌లో చేసింది.
మొన్నామధ్య అమెరికాలో(america) కొందరు మహిళా టీచర్లు విద్యార్థులతోనే వికృత చేష్టలు చేసి అరెస్టయ్యారు. అప్పుడు ఆ టీచర్ల ప్రవర్తన చూసి తిట్టుకున్నాం! లేటెస్ట్‌గా బ్రెజిల్‌లో(Brazil) సిబెల్లి ఫెరీరా అనే ఓ టీచర్ క్లాస్ రూమ్‌లోనే అసభ్యకరంగా డాన్స్‌లో చేసింది. అది కూడా విద్యార్థులతో! చేస్తే చేసింది.. ఆ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేసింది. ఈ దరిద్రాన్ని చూసి నెజిటన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారనుకోండి...!సోషల్ మీడియాలో ఈమె చేసిన డాన్స్ వీడియోలు వైరల్ కావడంతో అధికారులు ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారు.
బ్రెజిల్‌లోని ఓ స్కూల్‌లో సిబెల్లి ఫెరీరా(Sibelli Ferreira) ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె చాలా పాపులర్. టిక్‌టాక్‌లో(Tik Tok) 9.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారామెకు! ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) అయితే 1.2 మిలియన్ల మంది ఉన్నారు. ఇంత వరకు ఓకే. కాకపోతే క్లాస్ రూమ్‌లో స్టూడెంట్లను టీచింగ్ వైపు అట్రాక్ట్ చేసేందుకు కాసింత అభ్యంతరకరంగా డాన్స్ చేయడమే చాలా మందికి నచ్చలేదు. పైగా ఆ వీడియోలు టిక్‌టాక్లో షేర్ చేయడం ఇంకా నచ్చలేదు. చాలా మంది నెటిజన్లు ఆమె తీరును తిట్టిపోస్తున్నారు. ఫెరీరా ఫ్యాన్స్‌తో పాటు మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. విద్యను వినోదభరితంగా అందిస్తే తప్పేమిటి అని అంటున్నారు. విద్యార్థులకు బోధనపై ఆసక్తిని పెంచేందుకు సరదాగా డాన్స్ చేస్తే ఉద్యోగంలోంచి తీసేస్తారా? ఇదెక్కడి న్యాయం? అని కొందరు ట్వీట్లు పెడుతున్నారు. టిక్‌టాక్ ద్వారా అశేష అభిమానులను సంపాదించుకున్న ఫెరీరా బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ లావ్‌రాస్ నుంచి జీవశాస్త్రంలో డిగ్రీ చేశారు.