బ్రెజిలియన్‌ మోడల్(Brazilian model), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఆర్థర్‌ ఓ ఉర్సోకు(Arthur O'Urso) వింత సమస్య ఎదురయ్యింది. అతగాడి ఎనిమిది మంది భార్యలు(Wives) కలిసికట్టుగా ఓ కోరిక కోరారు. ఆ భార్యమణులకు తమ పతిదేవుడిని సిక్స్‌ప్యాక్‌లో చూడాలని ఉందట! ఆ కోరికనే భర్తకు వెల్లడించారు. కోరిక అనడం కంటే డిమాండ్‌ అంటే బాగా నప్పుతుంది.

బ్రెజిలియన్‌ మోడల్(Brazilian model), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఆర్థర్‌ ఓ ఉర్సోకు(Arthur O'Urso) వింత సమస్య ఎదురయ్యింది. అతగాడి ఎనిమిది మంది భార్యలు(Wives) కలిసికట్టుగా ఓ కోరిక కోరారు. ఆ భార్యమణులకు తమ పతిదేవుడిని సిక్స్‌ప్యాక్‌లో చూడాలని ఉందట! ఆ కోరికనే భర్తకు వెల్లడించారు. కోరిక అనడం కంటే డిమాండ్‌ అంటే బాగా నప్పుతుంది. ముద్దుల భార్యలు ముద్దుగా అడిగిన కోరికను ఆర్థర్‌ మాత్రం ఎలా కాదనగలడు? అందుకే రోజూ జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. పాపం సిక్స్‌ ప్యాక్‌(Six pack) కోసం చాలా కష్టపడుతున్నాడు.

తన ఎనిమిది మంది భార్యలు ప్రతి రోజూ తన అండర్‌వేర్‌ను(Underware) చెక్‌ చేస్తారని ఆర్థర్‌ చెబుతున్నాడు. అందుకు కారణం తనపట్ల వారికున్న శ్రద్ధనేనని గర్వంగా అంటున్నాడు. 2022లో తొమ్మిది మంది యువతులను ఆర్థర్‌ పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా ఆర్థర్‌ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఈ తొమ్మిది మందిలో ఒక భార్య మాత్రం ఇతడి నుంచి విడాకులు తీసుకున్నది.

ఇప్పుడు ఆర్థర్‌ తన ఎనిమిది మంది భార్యలతో హాయిగా ఉంటున్నాడు. వారి డిమాండ్‌ మేరకు ఆర్థర్‌ సిక్స్‌ప్యాక్‌ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. వారి కోరిక మేరకు శరీరంపై టాటూలు(Tatoo) కూడా వేయించుకున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ఆర్థర్‌ రోజులో ఎక్కువ భాగం జిమ్‌లోనే ఉంటున్నాడు. జిమ్‌కు అంకితమయ్యాడు. ఆర్థర్‌ శరీరపు కొలతల్లో ఏమైనా మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి అతడి భార్యలు ప్రతీ రోజూ అతగాడి అండర్‌వేర్‌ను కొలుస్తుంటారట!

ఈ విషయాన్ని ఆర్థరే ముసిముసినవ్వులు నవ్వుతూ చెబుతున్నాడు. పాపం భార్యల ముచ్చట తీర్చడానికి ఎంత త్యాగం చేస్తున్నాడంటే.. తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను కూడా తినడం మానేశాడు. చివరకు బ్రెడ్‌, పాస్తా కూడా తినడం లేదని ఆర్థర్‌ అంటున్నాడు. మరి సిక్స్‌ ప్యాక్‌ ఉత్తినే రాదుగా! ఒలింపిక్‌లో పాల్గొనే అథ్లెట్ల కోసం డిజైన్‌ చేసిన వ్యాయామాలను ఆర్థర్‌ చేస్తున్నాడు.

అప్పట్లో తొమ్మిది మంది భార్యలతో ఉన్నప్పుడు ఆర్థర్‌ ఓ కామెంట్‌ చేశాడు.. తాను పిల్లలను కనాలనుకుంటే ఫస్ట్ కమ్‌, ఫస్ట్‌ సర్వ్‌ రూల్‌ పాటిస్తానని అన్నాడు. అప్పుడు ఆర్థర్‌ చేసిన ఈ కామెంట్‌ పెద్ద దుమారం రేపింది. ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం.. నువ్వు ఎనిమిది మందితో ఎలా నెట్టుకొస్తున్నావురా బాబూ అని కొందరు మొగుళ్లు వాపోతున్నారు. పెళ్లికాని ప్రసాద్‌లైతే ఆర్థర్‌ను చూసి కుళ్లుకుంటున్నారు.

Updated On 16 Aug 2023 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story