అక్కడికి వెళితే అప్రయత్నంగానే ఒళ్లు జలదరిస్తుంది. వెన్నులో సన్నటి వణుకు మొదలవుతుంది. అది ఊరే కానీ మనిషన్నవాడు మచ్చుకు కూడా కనిపించడు. అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉన్న భూత్‌ బంగ్లాలే కనిపిస్తాయి. అంతటా భయంకరమైన నిశ్శబ్దం. వీధుల్లో తిరుగుతుంటే మన అడుగుల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. పాడైపోయిన వాహనాలు మనకు తారసపడతాయి. మరి జనం ఏరి? ఊరంతా ఎందుకు ఖాళీగా ఉంది.. రాత్రిళ్లు దెయ్యాలు తిరుగుతుంటాయా? అసలు ఆ ఊరికి ఏం జరిగింది.

అమెరికాలోని(america) కాలిఫోర్నియాలో(California) బోడీ(Bodi) అనే ఊరు ఒకటుంది. ఊరు కాదు కానీ చిన్నపట్టణం అనొచ్చు. అక్కడ రెండు వందలకు పైగా ఇళ్లులున్నాయి. వీటికి తగినట్టుగా చర్చిలు కూడా కనిపిస్తాయి. పాడుబడిన సెలూన్లు, జూదశాలలు, వినోద కేంద్రాలు, హోటళ్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా 50 శాతం శిథిలావస్థకు చేరుకున్నాయి. అప్పుడప్పుడు వచ్చిపోయే పర్యాటకులు తప్ప ఊరివాళ్లు ఎవరూ కనిపించరు. వచ్చే టూరిస్టులకు బస చేయడానికి ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. ఊరు పచ్చగా ఉన్న సమయంలో పది వేలకు పైగా జనాభా ఉండింది. అప్పుడు కళకళలాడిన ఊరవతల బంగారుగని ఇప్పుడు కళావిహీనంగా ఉంది.

అప్పుడు ఆ బంగారుగనిలో పని చేసేవారంతా ఈ ఊళ్లోనే ఉండేవారు. దెయ్యాల భయంతోనే ప్రజలను ఊరిని వదిలిపెట్టేసి తలోదిక్కుకు వెళ్లిపోయారు. ఏడు దశాబ్దాల కిందటి వరకు ఈ ఊళ్లో జనం ఉండేవారు. నెమ్మదిగా ఊరు ఖాళీ అయ్యింది. తర్వాత ఇంకెవ్రూ ఇక్కడకు వచ్చి స్థిరపడే ప్రయత్నం చేయలేదు. కారణం దెయ్యం భయమే! 1962లో కాలిఫోర్నియా ప్రభుత్వం ఈ ఊరును బోడీ స్టేట్‌ హిస్టారిక్‌ పార్క్‌గా మార్చేసింది. టన్నుల కొద్దీ గుండె ధైర్యం ఉన్న వారు అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. అలా వచ్చిన వారు ఊరి గురించి కథలు కథలుగా చెబుతుంటారు. పాడుబడిన ఇళ్లలో ఆత్మలను చూశామని, పిల్లలు ఆడుకుంటున్న చప్పుళ్లు కూడా వినిపించాయని చెబుతుంటారు. పాడైపోయిన ఇళ్లలో అప్పుడు ప్రజలు వాడుకున్న వస్తువులు దుమ్ముపట్టిపోయాయి. ఇనుము వస్తువులు తుప్పుపట్టాయి. ఫర్నీచర్‌ను, వాహనాలను కూడా వదిలేసి జనం ఎందుకు వెళ్లిపోయారో ఇప్పటికీ అంతుపట్టని విషయం. దెయ్యాలున్నయని అక్కడి ప్రభుత్వం నమ్ముతున్నదో ఏమో తెలియదు కానీ రాత్రి వేళ ఇక్కడ సందర్శకులను అనుమతించరు. ఏమైనా పగలు రావాల్సిందే!

Updated On 21 July 2023 6:46 AM GMT
Ehatv

Ehatv

Next Story