World War 3 : త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం.. 33 శాతం జనాభా ఉండరు..!
ప్రపంచ యుద్ధం-3(World war-3), దాని పర్యవసానాల గురించి సిడ్నీ(Sydney) బిషప్ మార్ మారి ఇమ్మాన్యుయేల్(Bishop Mar Mari Emmanuel) షాకింగ్ జోస్యం(Predictions) చెప్పారు.
ప్రపంచ యుద్ధం-3(World war-3), దాని పర్యవసానాల గురించి సిడ్నీ(Sydney) బిషప్ మార్ మారి ఇమ్మాన్యుయేల్(Bishop Mar Mari Emmanuel) షాకింగ్ జోస్యం(Predictions) చెప్పారు. ప్రపంచ యుద్ధం-III ప్రపంచమంతటా భయంకరమైన విధ్వంసం తెస్తుందని బిషప్ అన్నారు. ఈ యుద్ధంలో ప్రపంచంలోని మూడోవంతు జనాభా(33% Population) చనిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడవ ప్రపంచయుద్ధం సంభవించినట్లయితే, దాని నుండి బయటపడగలిగే వారు దాని తర్వాత మరణాన్ని కూడా కోరుకుంటారని బిషప్ పేర్కొన్నారు. అణ్వాయుధాల ప్రయోగం కూడా జరిగే అకాశం ఉందని బిషప్ హెచ్చరించారు. ఇమ్మాన్యుయేల్ సిడ్నీకి సుప్రసిద్ధ బిషప్. మూడో ప్రపంచ యుద్ధంపై Xలో కామెంట్ చేశారు. ప్రపంచ యుద్ధం-III తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదన్నారు. ఈ యుద్ధం జరిగితే ప్రపంచంలోని మూడో వంతు జనాభా నశించిపోతుందని, అది మానవాళికి వినాశనమేనని అన్నారు. ఒక వేళ యుద్ధంలో ఎవరైనా బతికి బట్టకట్టినా వారు ఎక్కువ కాలం బతకలేరని.. తమ చావును తామే కోరుకునే పరిస్థితులు వారి చుట్టూ ఉంటాయన్నారు. అణ్వాయుధాలు తయారుచేసిన దేశాలు వాటిని యుద్ధంలో వాడుతాయి కానీ వాటి పక్కన సెల్ఫీలు తీసుకోడానికి కాదని ఇమ్మాన్యుయేల్ అన్నారు.U.S. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA) జారీ చేసిన ఫెడరల్ ఎమర్జెన్సీ ద్వారా ఇమ్మాన్యుయేల్ సంచలన విషయాలు బయటపడ్డాయి. అణ్వాయుధాలతో యుద్ధ సమయంలో ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై మార్గదర్శకాలను తెలిపింది. ఇటీవల, రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది.