Iran Attack on Israel : ఇజ్రాయెల్‌తో ఇరాన్ నెగ్గుకు రాగలదా?
చెప్పినట్టుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసింది. మొన్నటి వరకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా ఇప్పుడు మాట మార్చింది. యుద్ధంలో కలగచేసుకోమంటూ ప్రకటించింది. మరోవైపు అమెరికా కనుక ఇజ్రాయెల్ వైపు ఉంటే తాము చూస్తూ ఊరుకోమని, ఇరాన్‌కు సహాయ సహకారాలను అందిస్తామని రష్యా చెప్పింది.
చెప్పినట్టుగానే ఇజ్రాయెల్(Israel)పై ఇరాన్(Iran) క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసింది. మొన్నటి వరకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా(America) ఇప్పుడు మాట మార్చింది. యుద్ధంలో కలగచేసుకోమంటూ ప్రకటించింది. మరోవైపు అమెరికా కనుక ఇజ్రాయెల్ వైపు ఉంటే తాము చూస్తూ ఊరుకోమని, ఇరాన్‌కు సహాయ సహకారాలను అందిస్తామని రష్యా చెప్పింది. మొత్తంగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం భీకరమవుతే ఏమవుతుందోనన్న ఆలోచన భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఇజ్రాయెల్ కంటే ఇరాన్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. ఇరాన్ జనాభా దాదాపు 9 కోట్లకు పైగానే ఉటుంది. అంటే ఇజ్రాయెల్ కంటే పది రెట్లు ఎక్కువ. అయితే సైనిక శక్తి మాత్రం ఇజ్రాయెల్‌కే ఎక్కువ. ఇరాన్ ఎక్కువగా తన పెట్టుబడులను మిసైళ్లు, డ్రోన్‌లపైనే పెట్టింది. ఆయుధ సంపత్తి కూడా బాగానే ఉంది. ప్రాక్సీ వార్ సాగిస్తున్న వారికి ఆయుధాలను సరఫరా చేస్తున్నది. యెమెన్‌లోని హౌతీలు, లెబనాన్‌లోని హిజ్‌బుల్లాలకు ఆయుధాలు ఇస్తున్నది ఇరానే! అయితే మోడ్రన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాటు ఫైటర్ జెట్స్ విషయంలో ఇరాన్ వెనుకబడి ఉన్నది. ఈ విషయంలో ఇరాన్‌కు రష్యా సహకారం అందిస్తోంది. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధానికి పరోక్షంగా ఇరాన్ సహకరిస్తున్నది. ఇరాన్ తయారు చేసిన షాహిద్ డ్రోన్‌లను రష్యాన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యాధునిక వైమానిక రక్షణ క్షేత్రం ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఐఐఎస్ఎస్ మిలిటరీ లెక్కల ప్రకారం.. ఇజ్రాయెల్ దగ్గర 14 స్వ్కాడ్రన్ల విమానాలు ఉన్నాయి. దాంట్లో ఎఫ్15, ఎఫ్16, ఎఫ్-35 జెట్ విమానాలు కూడా ఉన్నాయి. ప్రత్యర్థి లొకేషన్‌లోకి చొచ్చుకువచ్చి కచ్చితత్వంతో దాడులు చేయడం ఇజ్రాయిల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ఎలా రియాక్టవుతుందో చూడాలి.