ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఒక ప్రకటన చేశారు. హమాస్‌ను పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు జో బిడెన్ ఆదివారం అన్నారు.

ఇజ్రాయెల్(Israel), హమాస్(Hamas) మధ్య యుద్ధం(War) జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో(Joe Biden) బిడెన్ ఒక ప్రకటన చేశారు. హమాస్‌ను పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు జో బిడెన్ ఆదివారం అన్నారు. పాలస్తీనా(Palestine) రాజ్యానికి మార్గం కూడా స్పష్టంగా ఉండాలని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఒక ప్రశ్నకు సమాధానంగా.. హమాస్‌ను పూర్తిగా నాశనం చేయాలని నేను నమ్ముతున్నాను. అయితే పాలస్తీనా కూడా అవసరమని అన్నారు. గాజాను స్వాధీనం చేసుకోవడం ఇజ్రాయెల్ పొరపాటేనని.. అయితే హమాస్‌ను అక్కడి నుంచి తరిమికొట్టాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు(America President) హెచ్చరించారు. అయితే.. గాజాను తిరిగి స్వాధీనం చేసుకోవడం తప్పు అని బిడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించాడు. 1967 మధ్యప్రాచ్య యుద్ధంలో ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలేంలను స్వాధీనం చేసుకుంది.

దీంతో పాటు ఇరాన్‌(Iran)ను కూడా బిడెన్ హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఇరాన్ పని చేయకూడదని అన్నారు. అంతకుముందు.. ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్(Hussain) మాట్లాడుతూ.. తమ దేశం చర్య తీసుకోవచ్చని హెచ్చరించారు. ఇరాన్ పరిశీలకుడిగా మాత్రమే ఉండదని ఆయన అన్నారు. యుద్ధ పరిధి పెరిగితే అమెరికా కూడా చాలా నష్టపోతుందని హెచ్చరించారు."Written By : Senior Journalist M.Phani Kumar"

Updated On 17 Oct 2023 6:36 AM GMT
Yagnik

Yagnik

Next Story