అమెరికా క్యాలిఫోర్నియాలో శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని బుధవారం హిందూ వ్యతిరేక శక్తులు ధ్వంసం చేశాయి.

అమెరికా క్యాలిఫోర్నియాలో శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని బుధవారం హిందూ వ్యతిరేక శక్తులు ధ్వంసం చేశాయి. 10 రోజుల్లోనే అమెరికా(America)లో ఇది రెండో ఘటన. అంతేకాకుండా 'హిందువులు గో బ్యాక్‌'(Hindus go back) అని అక్కడ రాశారు. దీంతో ఆలయ సిబ్బంది ఈ దాడిని ఖండించింది. హిందూ దేవాలయం(hindu temple)లో జరిగిన విధ్వంసంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. దీంతో పలువురు హిందూ సంఘాల నేతలు ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పూజలు చేశారు. భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా(Ami Bera) ఈ ఘటనను ఖండించారు. ఇలాంటివాటికి తావిచ్చేదిలేదన్నారు. అయితే సెప్టెంబర్ 17న న్యూయార్క్‌(NewYork)లోని మెల్‌విల్లేలో ఉన్నశ్రీ స్వామినారాయణ మందిర్(Swaminarayan Mandir) ఆలయ ప్రాంగణం, ప్రవేశ ద్వారం మీద ద్వేషపూరిత సందేశాలు రాస్తూ దాడికి పాల్పడ్డారు. సఫోల్క్ కౌంటీ పోలీస్ హేట్ క్రైమ్స్ యూనిట్ నుంచి డిటెక్టివ్‌లు ఈ సంఘటనను ద్వేషపూరిత నేరంగా పరిశోధిస్తున్నారు. న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మెల్‌విల్లే ఆలయంలో జరిగిన విధ్వంసాన్ని ఖండించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

ehatv

ehatv

Next Story