Bangladesh : బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస. 105 మంది మృతి
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై హింస తీవ్రం కావడంతో శుక్రవారం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై హింస తీవ్రం కావడంతో శుక్రవారం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. సైన్యాన్ని మోహరించారు. దేశంలో ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించినట్లు ప్రధాని షేక్ హసీనా ప్రెస్ సెక్రటరీ నయీముల్ ఇస్లాం ఖాన్ తెలిపారు.
విద్యార్థుల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 105 మంది చనిపోయారు. ఇందులో 52 మరణాలు శుక్రవారం రాజధాని ఢాకాలో మాత్రమే సంభవించాయి. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో పాటు బాష్పవాయువు ప్రయోగాలు కూడా చేశారు. దేశంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్ అయ్యాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి పరిస్థితిని అదుపు చేయడం పెద్ద సవాల్ గా మారింది. కొన్ని రోజులుగా జరుగుతున్న హింసను పోలీసులు అడ్డుకోవడంలో విఫలమవడంతో సైన్యాన్ని మోహరించాల్సి వచ్చింది.
దేశ వ్యాప్తంగా రెండ్రోజులుగా సాగుతున్న హింసాకాండను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. విద్యార్థుల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 105 మంది చనిపోయారు. ఇందులో 52 మరణాలు శుక్రవారం రాజధాని ఢాకాలో మాత్రమే సంభవించాయి. ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యాన్ని మోహరించి కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని నయీముల్ ఇస్లాం తెలిపారు. తక్షణమే కర్ఫ్యూ అమల్లోకి వచ్చిందని తెలిపారు.
బంగ్లాదేశ్‌లో పరిస్థితిని భారత్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. హింసాత్మక నిరసనలు పొరుగు దేశ అంతర్గత వ్యవహారమని భారత్ పేర్కొంది. 8,000 మంది విద్యార్థులతో సహా దాదాపు 15 వేల మంది భారతీయులు బంగ్లాదేశ్‌లో ఉన్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. ఇప్పటి వరకు 405 మంది విద్యార్థులు భారత్‌కు చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పరిస్థితిని గమనిస్తున్నారు. అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. అక్కడి భారతీయులకు భద్రతా సహాయం కోసం మేము ఒక సలహాను జారీ చేసామని తెలిపారు.