బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా (PM Sheikh Hasina)తన పదవికి రాజీనామా(Resign)చేశారు.

బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా (PM Sheikh Hasina)తన పదవికి రాజీనామా(Resign)చేశారు. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆ వెంటనే ఆర్మీ పాలనను చేతుల్లోకి తీసుకోనున్నట్లు అక్కడి మీడియా చెప్పింది.

రిజర్వేషన్ల కోసం బంగ్లాదేశ్‌(Bangladesh)లో గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధాని హసీనా రాజీనామా డిమాండ్‌తో నిరసనకారులు రోడ్డెక్కారు. క్రమక్రమంగా ఆ అల్లర్లు తీవ్ర స్థాయకి చేరుకున్నాయి. నిరసనల్లో 300 మందికి పైగా మరణించారు. మరోవైపు.. బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా, ఆమె సోదరితో కలిసి భారత్‌కు(Bharat)ఆశ్రయం కోసం వస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం అందిన వెంటనే వేల మంది ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టి విధ్వంసకాండకు దిగారు.

ehatv

ehatv

Next Story