బంగ్లాదేశ్‌(Bangladesh)లో రిజర్వేషన్ల(Reservations)కు వ్యతిరేకంగా విద్యార్థుల(Students) నిరసన కొనసాగుతోంది. మరోవైపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్ అంతటా కర్ఫ్యూ(Curfew) విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

బంగ్లాదేశ్‌(Bangladesh)లో రిజర్వేషన్ల(Reservations)కు వ్యతిరేకంగా విద్యార్థుల(Students) నిరసన కొనసాగుతోంది. మరోవైపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్ అంతటా కర్ఫ్యూ(Curfew) విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో తాజా హింసాత్మక ఘటనల్లో 95 మందికి పైగా మరణించారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో మూడు రోజుల సెలవు ప్రకటించారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, ఫెనిలో హింసలో ఐదుగురు మరణించారు. ఇది కాకుండా సిరాజ్‌గంజ్‌లో నలుగురు, మున్షిగంజ్‌లో ముగ్గురు, బోగురాలో ముగ్గురు, మగురాలో ముగ్గురు, భోలాలో ముగ్గురు, రంగ్‌పూర్‌లో ముగ్గురు, పబ్నాలో ఇద్దరు, సిల్హెట్‌లో ఇద్దరు, కొమిల్లాలో ఒకరు, జైపూర్‌హాట్‌లో ఒకరు, ఢాకాలో ఒకరు మరణించారు. బారిసాల్‌లో కూడా ఒక‌రు చ‌నిపోయారు.

నిరసన నేప‌థ్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ(Bangladesh Ministry of Home Affairs) ప్రకటించింది. కర్ఫ్యూ సమయంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మొబైల్ ఇంటర్నెట్ అన్నింటిపై నిషేదం(Ban) విధించింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 'ప్రస్తుత పరిణామాల దృష్ట్యా.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారతీయ పౌరులు బంగ్లాదేశ్‌కు వెళ్లవద్దని సలహా ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని.. వారి కదలికలను పరిమితం చేయాలని.. ఢాకాలోని భారత హైకమిషన్‌తో అత్యవసర ఫోన్ నంబర్‌లు 8801958383679, 8801958383680, 8801937400591 ద్వారా టచ్‌లో ఉండాలని సూచించారు.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.. వందలాది మంది మరణించారు. శనివారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రధాన రహదారులను ఆందోళనకారులు దిగ్బంధించారు. పోలీసులు, విద్యార్థి నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. వివాదాస్పద రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలని నిరసన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు 30 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వ్ చేశారు. దీనిని నిరుద్యోగులు వ్య‌తిరేకిస్తున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story