బెంగళూరులో(Bangalore) పంచె కట్టుకొని మాల్‌కు వచ్చాడని ఓ వ్యక్తిని లోపలికి వెళ్లేందుకు సిబ్బంది అనుమతియ్యని ఘటన మనం చూశాం.

బెంగళూరులో(Bangalore) పంచె కట్టుకొని మాల్‌కు వచ్చాడని ఓ వ్యక్తిని లోపలికి వెళ్లేందుకు సిబ్బంది అనుమతియ్యని ఘటన మనం చూశాం. స్నేహం కోసం సినిమాలో చిరంజీవి-విజయ్‌కుమార్‌ ఓ గోనె బస్తాలో డబ్బులు నింపుకొని కార్ల షోరూంకు వస్తే 'మీ మొహాలకు అంత సీన్‌ లేదు.. వెళ్లండయ్యా, వెళ్లండి.. వీళ్లను అసలు లోపలికి ఎవరు రానిచ్చారు అంటూ' సెక్యూరిటీపై షోరూం సిబ్బంది అరవడం చూశాం. ఆ తర్వాత బస్తాలో ఉన్న డబ్బును కిందపోయగా చూసి ఆశ్చర్యపోవడం షోరూం సిబ్బంది వంతయింది. ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ యువతి షాపింగ్‌(Shopping) కోసమని ఓ మాల్‌కు(Mall) వెళ్లింది. కానీ అక్కడ ఆమెకు అవమానం ఎదురైంది. కస్టమర్లే దేవుడు అన్న విషయం పక్కన పెట్టి 'నువ్వు అంత ఖరీదైన వస్తువులను కొంటావా.. నీకు అంత సీన్‌ లేదులే' అన్నట్లు ప్రవర్తించారు. సదరు మహిళకు వస్తువులు చూపించేందుకు ఆసక్తి కనబర్చలేదు. ఆ షాప్ లో ఉన్న సిబ్బంది ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. సిబ్బందిని పిలిచినా కూడా సరిగా స్పందించలేదు. దీంతో అవమానంగా ఫీలైంది. ఆ తర్వాత వారిపై సదరు మహిళ అద్భుతమైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన చైనాలో(China) చోటు చేసుకుంది

ఓ మహిళ షాపింగ్ కోసం లూయిస్ విట్టన్(Louis Vuitton) షోరూమ్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు హెర్మేస్ హ్యాండ్ బ్యాగ్(Hand) కొనాలనుకుంది. అయితే ఆ షాప్ లో ఉన్న సిబ్బంది ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. అంతేకాదు ఆమెకు వస్తువులను చూపించడంలో కూడా పెద్దగా ఆసక్తిని కనపర్చలేదు. ఆమె పిలిచినా షాప్ సిబ్బంది రాకపోవడంతో అవమానంగా ఫీలైంది. దీంతో తనకు జరిగిన అవమానం గురించి లగ్జరీ బ్రాండ్‌ కంపెనీ హెడ్‌క్వార్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆ బ్రాండ్‌ బ్యాగ్‌ను ఎలాగైనా కొనాలనుకుంది. రెండు నెలలపాటు అందుకు అవసరమైన డబ్బును సేకరించింది. 6 లక్షల యువాన్లను (భారతదేశ కరెన్సీలో సుమారు 71 లక్షల రూపాయలు) సేకరించింది. తర్వాత మళ్లీ అదే షోరూంకు వెళ్లింది. అక్కడి సిబ్బందిని పిలిచి తన వెంట తెచ్చుకున్న డబ్బును లెక్కించమని సిబ్బందికి చెప్పింది. వస్తువులను చూసే పనిలో నిమగ్నమైంది. షాపులో ఉన్న ప్రతీ వస్తువును క్షుణ్ణంగా పరిశీలించసాగింది. తన డబ్బును లెక్కించేందుకు సిబ్బందికి రెండుగంటలకుపైగా సమయం పట్టింది. డబ్బును లెక్కించి 6 లక్షల యువాన్లు ఉన్నాయని సిబ్బంది ఆమెకు తెలిపారు. ఆ తర్వాత సిబ్బందికి యువతి షాక్‌ ఇచ్చింది. తనకు ఇక్కడ షాపింగ్‌ చేయడం ఇష్టం లేదంటూ తన డబ్బు తీసుకొని షాప్‌ నుంచి వెళ్లిపోయింది. ఇలా తనకు జరిగిన అవమానానికి సిబ్బందిపై పగ తీర్చుకుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా తన కోపాన్ని చూపించింది. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా విపరీతంగా వైరల్‌ అయిపోయింది.

Eha Tv

Eha Tv

Next Story