ఈ విశాల విశ్వంలో భూమివంటి గ్రహాలు అనేకం ఉండవచ్చు. చాలా గ్రహాలలో జీవం కూడా ఉండి ఉండవచ్చు. గ్రహాంతరవాసుల(aliens) కోసం మనం అనాదిగా అన్వేషిస్తూ వస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే భూమిని పోలిన గ్రహాలు ఉంటే ఉండవచ్చు కానీ మనలాంటి మనుషులు మాత్రం ఉండబోరు. మనకు ఉండేందుకు కాసింత తావునిచ్చి, తినడానికి తిండి నిచ్చి, పీల్చడానికి గాలినిచ్చి, తాగేందుకు నీటినిచ్చిన భూమిని(Earth) మనుషులు ఎంత పీల్చి పిప్పి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం.

ఈ విశాల విశ్వంలో భూమివంటి గ్రహాలు అనేకం ఉండవచ్చు. చాలా గ్రహాలలో జీవం కూడా ఉండి ఉండవచ్చు. గ్రహాంతరవాసుల(aliens) కోసం మనం అనాదిగా అన్వేషిస్తూ వస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే భూమిని పోలిన గ్రహాలు ఉంటే ఉండవచ్చు కానీ మనలాంటి మనుషులు మాత్రం ఉండబోరు. మనకు ఉండేందుకు కాసింత తావునిచ్చి, తినడానికి తిండి నిచ్చి, పీల్చడానికి గాలినిచ్చి, తాగేందుకు నీటినిచ్చిన భూమిని(Earth) మనుషులు ఎంత పీల్చి పిప్పి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. పర్యావరణాన్ని పూర్తిగా కలుషితం చేశారు. రాబోయే రోజుల్లో తాగేందుకు గుక్కెడు నీరు లేని పరిస్థితి రావచ్చు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. రుతువులు గతి తప్పాయి. వాతావరణ మార్పుల వల్ల భూగోళంపై మానవాళి అంతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మానవాళి ఏమిటీ? అప్పుడు సమస్త జీవరాశి అంతరించిపోతుంది. ఒకవేళ మానవాళి అంతరించిపోతే ఆ విషయం తర్వాతి తరాల వారికి లేదా వేరే గ్రహం నుంచి భూమికి వచ్చిన గ్రహాంతరవాసులకు ఆ విషయం ఎలా తెలుస్తుంది? ఈ సందేహం ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలకు(Australia Scientists) వచ్చింది. అందుకే వారు భూగోళం కోసం ఓ బ్లాక్‌బాక్స్‌ను(Black box) నిర్మిస్తున్నారు. 32 అడుగుల పొడవైన ఈ ఉక్కు స్థూపం వాతావరణ మార్పులకు సంబంధించిన వివరాలను నిరంతరం రికార్డు చేస్తుంది. వాటిని హార్డ్‌డ్రైవ్‌లలో భద్రపరుస్తుంది. భూగోళం నిర్జీవమవ్వడానికి దారి తీసిన సంఘటనల గురించి ఈ బ్లాక్‌బాక్స్‌ చెబుతుంది. వాతావరణ మార్పుల వల్ల ఏదైనా విపత్తు ఎదురైతే, దాన్ని నివారించడంలో మనుషులు ఎలా విఫలమయ్యారో తెలియచేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్‌ టాస్మానియా సహకారంతో ఆస్ట్రేలియన్‌ మార్కెటింగ్‌ సంస్థ క్లెమెంజర్‌ బీబీడీవో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. నిజానికి ఈ బ్లాక్‌బాక్స్‌ నిర్మాణం గురించి 2021 డిసెంబర్‌లోనే ప్రకటించారు. 2022 లోనే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ ఏడాది ఈ బ్లాక్‌బాక్స్‌ నిర్మాణం మొదలయ్యింది. ఈ ఏడాది చివరి వరకు పూర్తి అవుతుంది. ఈ బ్లాక్‌బాక్స్‌ను ఎక్కడ పెడతారన్నది ఇప్పటి వరకు చెప్పకపోయినా ఆస్ట్రేలియా పశ్చిమ తీరానికి సమీపాన స్ట్రాహన్‌-క్వీన్స్‌టౌన్‌కు మధ్యలో దీన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

Updated On 2 April 2024 1:18 AM GMT
Ehatv

Ehatv

Next Story