New Radio Signal : అంతరిక్షం నుంచి రేడియో సిగ్నల్స్
అంతరిక్షం నుంచి రేడియో సిగ్నల్స్
శాస్త్రవేత్తలు(scientist) ఆస్ట్రేలియాలోని మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ఒకే కక్ష్యలో తిరుగుతూ ప్రతి గంటకు పునరావృతమవుతున్న అరుదైన రేడియో సిగ్నల్స్‌ను(Radio signal) గుర్తించారు. ఈ వింత సిగ్నల్స్ శాస్త్రవేత్తలకే ఒక ప్రశ్నలాగా మారాయి. వీటిపై మరింత అధ్యయనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రే పాత్‌ఫైండర్ (ఏఎస్‌కేఏపీ )రేడియో టెలిస్కోప్ ద్వారా సేకరించిన డేటాలో ఇలాంటి సిగ్నల్ మొదటగా కనిపించింది. ఇది ప్రతి 53.8 నిమిషాలకు పునరావృతమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సిగ్నల్ మూడు వేర్వేరు రాష్ట్రాల గుండా వెళుతోంది. ఈ సిగ్నల్ వల్ల 10 నుంచి 50 సెకన్ల మధ్య ప్రకాశవంతమైన వెలుగు వస్తోంది. ఈ రేడియో తరంగాలు అన్నీ ఒకే దిశలో పాయింట్ అవుతున్నాయి. ఈ రేడియో సిగ్నల్ మూడు విభిన్న ఉద్గార స్థితులను కలిగి ఉండడం విచిత్రంగా ఉందని, దీని లక్షణాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని శాస్త్రవేత్త డాక్టర్ మనీషా కాలేబ్ అన్నారు. ఈ సిగ్నల్‌కున్న చిత్రవిచిత్ర లక్షణాలు భౌతిక శాస్త్రానికి అంతుపట్టడం లేదు. దక్షిణాఫ్రికాలోని మీర్‌కాట్ రేడియో టెలిస్కోప్ ఈ సిగ్నల్స్‌ను గుర్తించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇది న్యూట్రాన్ నక్షత్రం లేదా వైట్ డ్వార్ఫ్ నుంచి వెలువడుతున్నట్లు తెలుస్తోంది. రెండూ భారీ నక్షత్రాల నుంచి ఉత్పన్నమవుతాయి. న్యూట్రాన్ నక్షత్రాలు క్రమం తప్పకుండా రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. వైట్ డ్వార్ఫ్ ఎలక్ట్రాన్ క్షీణించిన మూలకం. న్యూట్రాన్ నక్షత్రం అనేది న్యూట్రాన్ క్షీణించిన మూలకం వైట్ డ్వార్ఫ్ అనేది భారీ వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇది న్యూట్రాన్ నక్షత్రం నుంచి వచ్చిందా లేదా అంతుచిక్కని వైట్ డ్వార్ఫ్ పల్సర్ నుంచి వచ్చిందా అన్నది మరికొన్ని పరిశోధనలతో వెల్లడికానుంది. దీనిపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనాలు చేస్తున్నారు.