ఆస్ట్రేలియా(australia) మహిళా ఎంపీపై(Woman MP) తోటి సభ్యుడే లైంగిక వేధింపులకు(Sexual harassment) పాల్పడ్డాడు. అది కూడా పార్లమెంట్‌(parliament) భవనంలోనే! ఇంతకంటే సిగ్గుచేటు మరోటి ఉండదేమో! ప్రజాస్వామ్య ఆలయంగా భావించే పార్లమెంట్‌ భవనం మహిళలు విధులు నిర్వర్తించడానికి సురక్షితంగా లేదంటూ ఆ మహిళ ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆస్ట్రేలియా(australia) మహిళా ఎంపీపై(Woman MP) తోటి సభ్యుడే లైంగిక వేధింపులకు(Sexual harassment) పాల్పడ్డాడు. అది కూడా పార్లమెంట్‌(parliament) భవనంలోనే! ఇంతకంటే సిగ్గుచేటు మరోటి ఉండదేమో! ప్రజాస్వామ్య ఆలయంగా భావించే పార్లమెంట్‌ భవనం మహిళలు విధులు నిర్వర్తించడానికి సురక్షితంగా లేదంటూ ఆ మహిళ ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సెనేట్‌ సభలో ఉద్విగ్నభరితమైన ప్రసంగం చేశారు. పార్లమెంట్‌లో శక్తివంతుడైన ఓ వ్యక్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని స్వతంత్ర మహిళా సెనేటర్‌(Senator) ఆరోపించారు.

కన్జర్వేటివ్‌ పార్టీకి(conservative Party) చెందిన సెనేటర్‌ డేవిడ్‌ వాన్‌(Senator David Wan) తనతో దారుణంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు. 'అతడెప్పుడూ నన్ను అనుసరించేవాడు . అభ్యంతరకరంగా తాకేవాడు. అసభ్యంగా ప్రవర్తించేవాడు. శృంగార కార్యకలాపాల కోసం ప్రతిపాదనలు చేసేవాడు. అతడున్నంత సేపూ ఆఫీసు గదిలోంచి బయటకు రావాలంటేనే భయమేసేది. తలుపు కొంచెం తెరిచి చూసి, అతడు లేడని తెలుసుకున్నాకే బయటకు వచ్చేదాన్ని. పార్లమెంట్‌ ప్రాంగణంలో నడవాల్సి వచ్చినప్పుడు తోడుగా ఎవరినో ఒకరిని తీసుకెళ్లేదాన్ని.

నాలా ఇంకొందరు కూడా అతడి నుంచి ఇలాంటి లైంగిక వేధింపులు అనుభవిస్తున్నారని తెలుసు. కానీ ఎక్కడ కెరీర్‌ పోతుందేమోనన్న భయంతో వారు బయటకు చెప్పడం లేదు. ఈ భవనం మహిళలకు సురక్షిత ప్రదేశం కాదు' అంటూ ఆ మహిళా ఎంపీ కన్నీటిపర్యంతమయ్యారు. పార్లమెంట్‌ నిబంధనలకు అనుగుణంగా తాను అతడిపై కేసు పెట్టనున్నట్టు తెలిపారు. అయితే ఈ ఆరోపణలన్నీ అసత్యాలేనని డేవిడ్‌ వాన్‌ అంటున్నాడు. దీనిపై తాను కూడా న్యాయపరంగా పోరాటం చేస్తానని చెబుతున్నాడు.

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో(Australia Parliament) ఇలాంటి సంఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఓ మహిళ పార్లమెంట్‌లో తనపై ఆత్యాచారం జరిగిందని ఆరోపించారు. 2019 మార్చిలో అప్పటి రక్షణ మంత్రి లిండా రెనాల్డ్‌ ఆఫీసులో పని చేసే ఓ సీనియర్‌ సిబ్బంది తనను సమావేశం ఉందని పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యింది. దీనిపై నాటి ప్రధాని స్కాట్ మారిసన్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పుకున్నారు.

Updated On 15 Jun 2023 2:55 AM GMT
Ehatv

Ehatv

Next Story