పాకిస్తాన్‌లోని స్వాత్‌లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సిటిడి) పోలీసు స్టేషన్‌లో సోమవారం జరిగిన పేలుళ్లలో 12 మంది పోలీసు అధికారులు మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేర‌కు జియో టీవీ పోలీసులను ఉటంకిస్తూ నివేదించింది. పోలీస్ స్టేషన్ లోపల జరిగిన రెండు పేలుళ్లలో భవనం పైర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు.

పాకిస్తాన్‌(Pakistan)లోని స్వాత్‌(Swat)లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (Counter Terrorism Department) పోలీసు స్టేషన్‌లో సోమవారం జరిగిన పేలుళ్లలో 12 మంది పోలీసు అధికారులు మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేర‌కు జియో టీవీ(Geo TV) పోలీసులను ఉటంకిస్తూ నివేదించింది. పోలీస్ స్టేషన్(Police Station) లోపల జరిగిన రెండు పేలుళ్ల(Blasts)లో భవనం పైర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు.

భద్రతా అధికారులు ప్రావిన్స్ అంతటా "అత్యంత అప్రమత్తంగా" ఉన్నారని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఇన్స్‌ఫెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్(Akhtar Hayat Khan) తెలిపారు. పేలుడు ఆత్మాహుతి దాడి కాదని పేర్కొన్నారు. మందుగుండు సామాగ్రి, మోర్టార్ షెల్స్‌ను నిల్వ ఉంచిన ప్రదేశంలో పేలుడు జరిగిందని సీటీడీ డీఐజీ ఖలీద్ సోహైల్(Khalid Sohail) జియో న్యూస్‌తో చెప్పారు. పోలీస్ స్టేషన్‌పై ఎలాంటి దాడి, కాల్పులు జరగలేదని చెప్పారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని, కేసును విచారించేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్నాయని ఆయన తెలిపారు. కూలిన భవనం పాతదేనని.. చాలా కార్యాలయాలు, సిబ్బంది కొత్త భవనంలో ఉన్నారని ఖలీద్ సోహైల్ తెలిపారు. భవనం కుప్పకూలడం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడిందని తెలిపారు.

పేలుడు కార‌ణంగా ప్రాంతీయ ఆరోగ్య విభాగం స్వాత్‌లోని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని విధించింది. అంతకుముందు, జిల్లా పోలీసు అధికారి షఫీ ఉల్లా గండాపూర్(Shafi Ullah Gandapur) (DPO) "ఆత్మహత్య దాడి" జరిగిందని పేర్కొన్నారు. దాడి ఆరోపణలపై స్పందిస్తూ.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) పేలుడును ఖండించారు. ప్రాణాలు కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు రేడియో పాకిస్థాన్‌ను ఉటంకిస్తూ జియో న్యూస్ తెలిపింది.

Updated On 25 April 2023 6:18 AM GMT
Yagnik

Yagnik

Next Story