పాకిస్థాన్ దేశంలో అసలు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయా.. లేక ఇంకేమైనా జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతూ ఉంది. ఎవరికి వారు తామే గెలిచామని చెప్పుకుంటూ ఉంటే.. అసలు ఎన్నికల సంఘం ఏమి చేస్తోందో తెలియక ప్రజలు తికమకపడుతూ ఉన్నారు.

పాకిస్థాన్(Pakistan) దేశంలో అసలు అసెంబ్లీ ఎన్నికలు(elections) జరుగుతున్నాయా.. లేక ఇంకేమైనా జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతూ ఉంది. ఎవరికి వారు తామే గెలిచామని చెప్పుకుంటూ ఉంటే.. అసలు ఎన్నికల సంఘం ఏమి చేస్తోందో తెలియక ప్రజలు తికమకపడుతూ ఉన్నారు. నిన్న రాత్రి నవాజ్ షరీఫ్ తమ పార్టీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా అవతరించిందని చెప్పగా.. ఇమ్రాన్ ఖాన్ తాను మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచారని చెబుతూ ఉన్నాడు.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఏఐ ఆధారిత విక్టరీ స్పీచ్‌ ను రిలీజ్ చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధినేత నవాజ్ షరీఫ్(Nawaz Sharif) లండన్ ప్లాన్ ఫెయిల్ అయిందన్నారు. పోలింగ్ రోజున ఓటర్లు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారని.. భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని, మీ ప్రజాస్వామ్య ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పౌర స్వేచ్ఛను పునరుద్ధరించడానికి పునాది వేశారని ఇమ్రాన్ స్పీచ్ లో తెలిపారు. ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించేందుకు మీరు సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

ఇక పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తన మద్దతుదారులతో మీడియా ముందుకు వచ్చారు. తన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్‌-ఎన్‌) ఘన విజయం సొంతం చేసుకుందని ప్రకటించారు. ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయక ముందే ఆయన స్వయంగా మీడియా ముందుకొచ్చిన ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం లేదని, దేశంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని పార్టీలు తమకు మద్దతునివ్వాలని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. పీపీపీ (పాకిస్థాన్ పిపుల్స్ పార్టీ) నేత పాక్‌ మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారినీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. మొత్తం 366 స్థానాలు ఉన్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో ప్రస్తుతం 265 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 133 మంది సభ్యులు అవసరం.

Updated On 9 Feb 2024 11:16 PM GMT
Yagnik

Yagnik

Next Story