Pakistan Elections Results 2024 : పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వం? నవాజ్ షరీఫ్‌కు ఆర్మీ మద్దతు!
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు(Pakistan Election Results) వచ్చాయి. ఇమ్రాన్‌ఖాన్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాట్లుకు ఆ సంఖ్య సరిపోదు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు(Pakistan Election Results) వచ్చాయి. ఇమ్రాన్‌ఖాన్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాట్లుకు ఆ సంఖ్య సరిపోదు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలన్నీ వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. మరోవైపు చాలా చోట్ల ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ పీటీఐ (ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహరిక్ ఇన్సాఫ్) మద్దతుదారులో కోర్టులో కేసులు దాఖలు చేశారు. పీటీఐ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించినప్పటికీ ఫలితాలలో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారంటూ పీటీఐ ఆరోపిస్తోంది. అయితే ఆర్మీ మద్దతులో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రావడం ఆర్మీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆర్మీకి ఇమ్రాన్ లొంగకపోవడమే ఇందుకు కారణం. అందుకే తమ కీలుబొమ్మ అయిన నవాజ్ షరీఫ్‌ను గద్దెనెక్కించాలనుకుంటోంది ఆర్మీ. 266 మంతి సభ్యుల జాతీయ అసెంబ్లీలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 264 స్థానాల ఫలితాలు వచ్చాయి. ఒక ఫలితాన్ని నిలిపివేశారు. ఈ ఎన్నికలలో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ మద్దతుతో స్వతంత్రులుగా పోటీ చేసిన వారిలో 101 మంది విజయం సాధించారు. పార్టీ సింబల్ లేకపోయినా వీరంతా విజయం సాధించడం పాక్ ప్రజలలో ఇమ్రాన్‌ఖాన్‌కు ఉన్న ఆదరాభిమానాలకు నిదర్శనమని చెప్పవచ్చు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ 75 స్థానాలలో గెలుపొందగా, బిల్వాల్ జర్దారి భుట్టోకు చెందిన పీపీపీ 54 స్థానాలను సంపాదించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 133 స్థానాలు అవసరం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్-ఎన్ పావులు కదుపుతోంది.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసీమ్ మునీర్ కూడా నవాజ్ షరీఫ్‌కు మద్దతుగా రంగంలోకి దిగారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆసీమ్ మునీర్ చెప్పడమే పెద్ద జోక్!