వచ్చే శనివారం ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఓ ప్రత్యేక దృశ్యం కనులవిందు చేయనుంది. సూర్యుడిలో(Sun) ఓ నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుడి చుట్టూ అగ్నివలయం కనిపించనుంది. రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా(Ring Of Fire) పిలుచుకునే ఈ అగ్నివలయం సూర్యగ్రహణం(Solar Eclipse) కారణంగా ఏర్పడుతున్నది.

వచ్చే శనివారం ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఓ ప్రత్యేక దృశ్యం కనులవిందు చేయనుంది. సూర్యుడిలో(Sun) ఓ నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుడి చుట్టూ అగ్నివలయం కనిపించనుంది. రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా(Ring Of Fire) పిలుచుకునే ఈ అగ్నివలయం సూర్యగ్రహణం(Solar Eclipse) కారణంగా ఏర్పడుతున్నది. ఈ ఏడాదిలో చివరిసారిగా ఏర్పడుతున్న ఈ సూర్యగ్రహణం డిఫరెంట్‌గా కనిపించబోతున్నది. సూర్యగ్రహణం ఏర్పడిన ప్రతీసారి ఇలా జరగదు కాబట్టే దీనికి అంత ప్రత్యేకత! భూమికి(Earth), సూర్యుడికి మధ్యన చంద్రుడు(moon) వచ్చినప్పుడు చంద్రుని నీడ భూమిపై పడుతుంది. ఫలితంగా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ శనివారం రోజున ఏర్పడే సూర్యగ్రహణం మామూలుది కాదు.

ఇది కంకణాకృతి సూర్యగ్రహణం. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఈ అరుదైన గ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహణం సమయంలో కొన్ని సార్లు సూర్యుడు మొత్తంగా చంద్రుడి వెనుకాతల ఉంటాడు. సంపూర్ణంగా చంద్రుడి వెనుకాతలకి వెళబోతున్న సమయంలో మెరుస్తున్న ఉంగరంలా కనిపిస్తాడు. సూర్యుడి ప్రకాశాన్ని చంద్రుడు పూర్తిగా కప్పేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కంకణాకార సూర్యగ్రహణంలో సూర్యుడు ఎలా కనిపిస్తాడంటే చంద్రుని బ్లాక్‌ డిస్క్‌ చుట్టూ ఉండే రింగ్‌లా కనిపిస్తాడు.

దీన్ని యాన్యులస్‌(annulus eclipse) అంటారు. మామూలుగా అయితే సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటాడు. కానీ శనివారం సంభవించే వార్షిక సూర్య గ్రహణంలో చంద్రుడు, భూమి కక్ష్యలో దూరంగా ఉంటాడు. ఈ కారణంగా ఆకాశంలో సూర్యుడి కంటే కొంత చిన్నగా చంద్రుడు కనిపిస్తూ సూర్యుడిని అడ్డుకుంటాడు. సూర్యుడిని పూర్తిగా కవర్‌ చేయడన్నమాట! అందుకే సూర్యుడి స్థానంలో అగ్నవలయం కనిపిస్తుంది. మన బ్యాడ్‌లక్కేమిటంటే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించకపోవడం.

అందుకు కారణం మనదేశంలో ఈ సూర్యగ్రహణం రాత్రిపూట సంభవించడమే. భారత దేశంలో చంద్రుడు కనిపించే సమయానికి సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో(America) కనిపిస్తుంది. నాసా ఎలాగూ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది కాబట్టి మనం ఆ సూర్యగ్రహణాన్ని టీవీలలో చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు ఈ సూర్యగ్రహణాన్ని చూడవచ్చని నాసా చెబుతోంది. అమెరికాలోని ఒరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, టెక్సాస్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌ దేశాలలో ఇది సూర్యాస్తమయానికి ముందు కనిపించనుంది.

Updated On 11 Oct 2023 1:45 AM GMT
Ehatv

Ehatv

Next Story