మనిషి బుద్ధిఎరిగిన తర్వాత నిప్పు కనిపెట్టాడు. తన శరీరాన్ని కాపాడుకునేందుకు బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాడు. మరి పాదరక్షలు ఎప్పుడు వేసుకున్నాడు? పాదాలను కాపాడుకోవాలనే స్పృహ ఎప్పుడు మొదలయ్యింది? ఈ ప్రశ్న పరిశోధకులు కూడా వేసుకున్నారు. సమాధానం కోసం అన్వేషించారు. ఇప్పుడు జవాబు దొరికింది.

మనిషి బుద్ధిఎరిగిన తర్వాత నిప్పు కనిపెట్టాడు. తన శరీరాన్ని కాపాడుకునేందుకు బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాడు. మరి పాదరక్షలు ఎప్పుడు వేసుకున్నాడు? పాదాలను కాపాడుకోవాలనే స్పృహ ఎప్పుడు మొదలయ్యింది? ఈ ప్రశ్న పరిశోధకులు కూడా వేసుకున్నారు. సమాధానం కోసం అన్వేషించారు. ఇప్పుడు జవాబు దొరికింది. పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని కేప్‌కోస్ట్‌(Cape Coast)లో ఓ విషయాన్ని కనిపెట్టారు. ఆదిమానవుల సాంకేతిక పరిజ్ఞానానికి ఇదో మచ్చుతునక అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మధ్యరాతి యుగంలోనే మనిషి బూట్లు వేసుకోవడం మొదలుపెట్టాడని కొత్త పరిశోధనల వల్ల తెలిసింది. అప్పటి కాలాన్ని మెసోలిథిక్‌ కాలం(Mesolithic) అంటారు. ఆఫ్రికన్‌ పూర్వ చరిత్రలో ఒకప్పటి కాలమిది. ఈ కొత్త ఆవిష్కరణ 75 వేల సంవత్సరాల నుంచి లక్షా 50 వేల సంవత్సరాల కిందటిదని సైంటిస్టులు భావిస్తున్నారు. మనం ఇప్పటి వరకు అనుకుంటున్నదాని కంటే పూర్వ మానవులు ఎంతో తెలివిగలవారని తేలింది. మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన అత్యంత పురాతన ఆవిష్కరణల్లో బూట్లు కూడా ఒకటని ఈస్ట్‌ హార్ట్‌ఫోర్డ్‌(East Hartford)లోని గుడ్‌విన్‌ యూనివర్సిటీ(Goodwin University)కి చెందిన ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌ రాండీ లైస్ట్(Randy Laist) తెలిపారు. 2020లో రాసిన ఓ వ్యాసంలో ఈ విషయాలను ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు మనం అనుకున్నదేమిటంటే బూట్లు మనిషి వేసుకోవడం మొదలయ్యి మహా అయితే ఆరు వేల సంవత్సరాలై ఉంటుందేమోనని! అయితే తాజా పరిశోధనలు ఆ అభిప్రాయాలు తప్పని తేల్చాయి. విట్‌వాటర్‌రాండ్‌ యూనివర్సిటీక పరిశోధకుడు బెర్న్‌హార్డ్‌ జిప్‌ఫెల్‌ ఏం చెబుతున్నారంటే.. మధ్యరాతి యుగంలో కేప్‌ తీరం వెంబడి బీచ్‌లో పురాత మానవుల పాదముద్రల శిలాజాలను కనిపెట్టామని, వాటిని పరిశీలించినప్పుడు వారు బూట్లు ధరించి ఉండవచ్చని స్పష్టంగా తేలిందని అంటున్నారు. కేప్‌ కోస్ట్‌ తీరంలో ఉన్న రాళ్లు చాలా పదునుగా ఉండేవని, అవి పాదాలకు గాయాలు చేయకుండా ఉండేందుకు బూట్లు ఉపయోగించి ఉండవచ్చని బెర్న్‌హార్డ్‌ జిప్‌ఫెల్‌ అంటున్నారు.అయితే వారు ఏ రకమైన బూట్ల వేసుకున్నారనేదానిపై పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. పురాతన పాదముద్రల శిలాజాల లాంటి ఇతర ఆధారాలతో మనిషి ధరించిన నాటి కాలపు పాదర‍క్షల గురించి తెలుసుకునే ‍ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి మనుషులు బూట్లు వేసుకున్నారా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు దక్షిణాఫ్రికాలోని రెండు ప్రదేశాలలో అప్పటి మనిషి ఎముకల ఆకారం, పరిమాణాన్ని విశ్లేషించారు. అక్కడ నివసించిన ప్రజల కాలి ఎముకలు వారి పూర్వీకుల కంటే చాలా సన్నగా, తక్కువ దృఢంగా ఉన్నాయని తేలింది. కాలి స్వరూపంలో ఈ మార్పుకు కారణం బూట్లు ధరించడం వల్లనేనని పరిశోధకులు చెబుతున్నారు.

Updated On 23 Nov 2023 2:16 AM GMT
Ehatv

Ehatv

Next Story