ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. లేటెస్ట్‌గా ఆయన ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌ చేశారు. ఇలాన్‌ మస్క్‌కు(Elon musk) చెందిన స్పేస్‌ఎక్స్‌(Space X) స్టార్‌షిప్‌ విజయవంతంగా దాని లాంచ్‌ ప్యాడ్‌కు తిరిగి వచ్చిన సందర్భంగా ఆ వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా 'నేను నా టికెట్‌ను ఎక్కడ కొనాలి' అంటూ రాసుకొచ్చారు. 'స్పేస్‌ఎక్స్‌ ప్రయోగం జరుగుతున్న సమయంలో నేను టీవీ ముందే ఉండిపోయాను. స్పేస్‌ఎక్స్‌ తిరిగిరావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. అంతరిక్ష ప్రయాణంలోనే ఇది కీలకమైన క్షణం కావచ్చు' అని ఆనంద్‌ మహీంద్రా అన్నారు. మొదటిసారి రోదసిలోకి దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ సురక్షితంగా భూమిపైకి చేరుకుంది. ప్రపంచంలో ఇలా తిరిగి వచ్చిన మొదటి బూస్టర్‌గా స్టార్‌షిప్ రాకెట్ గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఇలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ కిందికి దిగటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Eha Tv

Eha Tv

Next Story