ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అవ్వడం సర్వ సాధారణం. మంచి కోసం ప్రభుత్వాలు తలపెట్టే ఈ పథకాలను కొందరు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. వీటి ద్వారా లబ్ధి పొందడానికి కక్కుర్తిపడతారు. ఎంతకైనా తెగిస్తారు. కాకపోతే గర్భాల(Pregnancy) పేరిట లక్షలకు లక్షలు దొబ్బేయడం మాత్రం ఎక్కడా చూసి ఉండం. ఇటలీలోని(Italy) రోమ్‌కు(Rome) చెందిన 50 ఏళ్ల బార్బరా లోయల్‌ ఆ పని చేసింది.

ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం అవ్వడం సర్వ సాధారణం. మంచి కోసం ప్రభుత్వాలు తలపెట్టే ఈ పథకాలను కొందరు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. వీటి ద్వారా లబ్ధి పొందడానికి కక్కుర్తిపడతారు. ఎంతకైనా తెగిస్తారు. కాకపోతే గర్భాల(Pregnancy) పేరిట లక్షలకు లక్షలు దొబ్బేయడం మాత్రం ఎక్కడా చూసి ఉండం. ఇటలీలోని(Italy) రోమ్‌కు(Rome) చెందిన 50 ఏళ్ల బార్బరా లోయల్‌ ఆ పని చేసింది. నకిలీ గర్భాల(Fake Pregnancy) పేరుతో సుమారు 98 లక్షల రూపాయల వరకు ప్రసూతి ప్రయోజనాలను పొందింది. ఆమె గర్భం దాల్చిన సమయంలో కలిగిన శిశువుల గురించి ఏ హాస్పిటల్‌లోనూ రికార్డు కాలేదు. అధికారులు కూడా చూడలేదు. రోమ్‌లో ఉన్న క్లినిక్‌ల నుంచి పిల్లల బర్త్‌ సర్టిఫికెట్లను(Birth certificate) దొంగిలించేది బార్బరా లోయల్. వాటిని తన పేరుతో అచ్చంగా అదే మాదిరిగా సర్టిఫికెట్లను తయారు చేసేది. వాటితో ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతూ వచ్చింది. ఈ విధంగా 24 ఏళ్ల కాలంలో 12 అబార్షన్లు జరిగినట్టు, అయిదుగురు పిల్లలు పుట్టినట్టు తెలిపింది. మొత్తం మీద 17 బూటకపు గర్భాలతో అధికారులను మోసం చేసింది. లేటెస్ట్‌గా గత డిసెంబర్‌లో తాను మరో బిడ్డను ప్రసవించినట్టు తెలిపింది. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. గత తొమ్మిది నెలలుగా ఆ 50 ఏళ్ల మహిళపై గట్టి నిఘా పెట్టారు. ఆమె గర్భం అంతా బూటకం అని తేలింది. కడుపొచ్చినట్టు కనిపించడానికి దిండ్లను ఉపయోగించేదట! పైగా పుట్టబోయే బిడ్డను మోస్తున్నట్టుగా చాలా బరువు మోస్తున్నట్టు కలరింగ్‌ ఇచ్చేదట! ఆమె భర్త డేవిడ్‌ పిజ్జినాటోను గట్టిగా అడిగే సరికి, తన భార్య గర్భవతి కాదని ఒప్పేసుకున్నాడు. దీంతో పోలీసులు ఆ దంపతులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రజా సంస్థను మోసం చేయడమే గాదు దానికి హాని తలపెట్టారంటూ ఆ ఆలుమగలను కోర్టు తిట్టింది. ప్రజా ప్రయోజనంలో భాగంగా సదరు రాష్ట్రం మహిళలకు అందించే ప్రసూతి ప్రయోజనాలను దుర్వినియో పరిచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే తనకు అయిదుగురు పిల్లలు ఉన్నారని పలుసార్లు గర్భస్రావాలు జరిగినట్లు ఫేక్‌ సర్టిఫికెట్లు ప్రొడ్యుస్‌ చేయడమే కాకుండా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయడం మరింత నేరమని కోర్టు అభిప్రాయపడింది. అందుకుగానూ బార్బరా లోయెల్‌కి ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. ఈ నేరానికి సహకరించిన ఆమె భర్తకు కూడా శిక్ష విధించింది.

Updated On 21 Feb 2024 3:58 AM GMT
Ehatv

Ehatv

Next Story