Pakistan : కన్నీరు పెట్టిస్తున్న గోధుమ పిండి, చక్కెర ధరలు
పాకిస్థాన్‌లో చక్కెర ధర ప్రజలను కంటతడి పెట్టిస్తుంది. అక్కడి మార్కెట్‌లో చక్కెర కిలో రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. హోల్ సేల్ మార్కెట్ లో కిలో చక్కెర ధర రూ.132 నుంచి రూ.137కి చేరుకుంది. దీంతో రిటైల్ మార్కెట్‌లో కిలో చక్కెర ధర రూ.150కు విక్రయిస్తున్నారు. కరాచీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పిండి ధరల రికార్డులన్నీ బద్దలయ్యాయి.
పాకిస్థాన్(Pakistan)లో చక్కెర ధర(Sugar Rate) ప్రజలను కంటతడి పెట్టిస్తుంది. అక్కడి మార్కెట్‌లో చక్కెర కిలో రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. హోల్ సేల్ మార్కెట్(Holesale Market) లో కిలో చక్కెర ధర రూ.132 నుంచి రూ.137కి చేరుకుంది. దీంతో రిటైల్ మార్కెట్(Retail Market)లో కిలో చక్కెర ధర రూ.150కు విక్రయిస్తున్నారు. కరాచీ(Karachi)తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పిండి ధరల రికార్డులన్నీ బద్దలయ్యాయి. పాకిస్థాన్‌లోని కరాచీ చరిత్రలో తొలిసారిగా 20 కిలోల గోధుమ పిండి 3200 రూపాయలకు చేరుకుంది. అంటే కిలో పిండి రూ.160. ధరలు విపరీతంగా పెరగడంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ(Subsidy) పిండి కోసం పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి.
నివేదికల ప్రకారం.. ఇస్లామాబాద్(Islamabad), పంజాబ్(Punjab)లోని ధర కంటే కరాచీలో పిండి ధర ఎక్కువగా ఉంది. కరాచీలో 20 కిలోల పిండి సంచి రూ.200 పెరగడంతో ధరలు రూ.3,200కి చేరాయి. హైదరాబాద్(Hyderabad)లో 20 కిలోల బస్తా రూ.140 పెంచిన తర్వాత రూ.3,040కి విక్రయిస్తున్నారు. ఇస్లామాబాద్, రావల్పిండి(Rawalpindi), సియాల్‌కోట్(Sialkot), ఖుజ్దార్‌లలో 20 కిలోల బస్తాల ధరలు వరుసగా రూ.106, రూ.133, రూ.200, రూ.300 చొప్పున పెరిగాయి.
ఈ సంక్షోభానికి పాకిస్థాన్ కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russo-Ukrainian War), 2022లో విధ్వంసకర వరదలు, ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో గోధుమల అక్రమ రవాణా వంటి అంశాలు సంక్షోభానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. వరదల కారణంగా ధ్వంసమైన సింధ్(Sindh), బలూచిస్థాన్(Balochistan)లలో గోధుమల ధరలు భారీగా పెరిగాయి. పాకిస్తాన్ ప్రణాళికా సంఘం ప్రకారం.. వరదల కారణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు $3.725 బిలియన్ల నష్టం వాటిల్లింది.