USలోని ఫ్లోరిడా విమానాశ్రయం నుండి ఫియోనిక్స్‌కు వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.

USలోని ఫ్లోరిడా విమానాశ్రయం నుండి ఫియోనిక్స్‌కు వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయ్యే కొద్ది క్షణాల ముందు రన్‌వేపై విమానంలోని టైర్‌లలో ఒకటి పేలిపోయింది. ఫ్లైట్ 590 టాంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 8 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) టేకాఫ్ అయ్యే ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. టైర్ పేలిన వీడియో రికార్డు కూడా అయింది. అకస్మాత్తుగా, టైర్ పేలడంతో మంటలు వ్యాపించాయి, అక్కడ పొగ కూడా కమ్ముకోవడం మనం వీడియోలో చూడొచ్చు. టైర్ పేలుడు సంభవించినప్పటికీ కొంత దూరం విమానం వెళ్ళింది.. విషయాన్ని గమనించిన పైలట్ విమానాన్ని ఆపేశాడు. అత్యవసర సహాయక సిబ్బందికి సంబంధించిన వాహనాలు అక్కడికి చేరుకున్నాయి.


ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. వెంటనే వారిని విమానం నుండి ఖాళీ చేయించారు. అలాగే విమానాన్ని టెర్మినల్‌కు పంపినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి అల్ఫ్రెడో గార్డునో తెలిపారు. ప్రయాణికులను రీప్లేస్‌మెంట్ ఫ్లైట్‌కు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో ఇతర విమాన కార్యకలాపాలు ప్రభావితం కాలేదని ఎయిర్‌లైన్స్ తెలిపింది. US యొక్క ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ అయిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తోంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులను సురక్షితంగా దింపి టెర్మినల్‌కు తరలించామని ఏజెన్సీ తెలిపింది.

Eha Tv

Eha Tv

Next Story