American Airlines : పేనుకు పెత్తనమివ్వకపోయినా విమానం ఆగింది!
అమెరికన్ ఎయిర్‌లైన్స్(American Airlines) విమానంలో ప్రయాణిస్తున్నవారికి చిత్రమైన అనుభవం ఎదురయ్యింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్(American Airlines) విమానంలో ప్రయాణిస్తున్నవారికి చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. విమానం అత్యవసరంగా ల్యాండ్(emergency Land) అయ్యింది. అందుకు కారణం సాంకేతిక సమస్యనో, ఎవరికైనా అత్యవసర వైద్యసాయం అవసరమైనందుకో, బాంబు బెదిరింపులో, వాతావరణం సహకరించకపోవడమో కాదు.. మరేమిటి?
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లాస్ ఏంజిలిస్(Loss angels) నుంచి న్యూయార్క్‌కు వెళుతోంది. విమానం గాలిలో ఉన్నప్పుడు ఓ మహిళ తలలో పేలు(Lice) పాకుతుండటం తోటి ప్రయాణికులు చూశారు. వెంటనే వారు విమాన సిబ్బందికి కంప్లయింట్ చేశారు. దాంతో ఫీనిక్స్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానాన్ని మళ్లిస్తున్నట్టు మాత్రమే విమాన సిబ్బంది చెప్పారు. దాంతో ప్రయాణికులలో అయోమయం నెలకొంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులలో ఒకరు విమానం ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యిందని అడిగినప్పుడు అసలు విషయం తెలిసింది.
ఓ మహిళ తలలో పేలు పాకుతుండటాన్ని ఇద్దరు ప్రయాణికులు చూసి విమాన సిబ్బందికి చెప్పారట! వారొచ్చి చూస్తే నిజంగానే ఆమె తలలో పేలు పాకుతున్నాయట! దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారట! ఈ ఘటన కారణంగా విమానం 12 గంటలు ఆలస్యమైంది. అప్పటి వరకు ప్రయాణికులకు విశ్రాంతి తీసుకునేందుకు హోటల్ సదుపాయాన్ని కల్పించారు.