Joe Biden : జో బైడెన్‌కు ఏమైంది? ఎందుకలా వింతగా ప్రవర్తిస్తున్నారు?
పెరిగిన వయసో , అల్జీమర్స్ ప్రభావమో తెలియదు కానీ అగ్రరాజ్యం అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(Joe Bidden) కొన్నాళ్లుగా వింతగా ప్రవర్తిస్తున్నారు.
పెరిగిన వయసో , అల్జీమర్స్ ప్రభావమో తెలియదు కానీ అగ్రరాజ్యం అమెరికా(America) అధ్యక్షుడు జో బైడెన్(Joe Bidden) కొన్నాళ్లుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటలీ(Italy) వేదికగా ప్రతిష్టాత్మక జీ-7 దేశాల సదస్సులోనూ(G7 Sumit) బైడెన్ విచిత్రంగా ప్రవర్తించారు. ఇటలీ తీరప్రాంత నగరం అపూలియాలో రెండు రోజులపాటు జీ-7 సదస్సు కొనసాగనుంది. ఈ సదస్సు కోసం జీ-7 కూటమి దేశాల నేతలు ఇటలీ చేరుకున్నారు. సదస్సు ఆరంభానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని అతిథులు సదర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్‌ను వీక్షించారు. పారా గైడ్లింగ్ చేస్తున్న వారిని పలకరించారు. ఆ సమయంలోనే జో బైడెన్ వింతగా ప్రవర్తించారు. బీచ్ దగ్గర రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్‌లు వాటర్ స్పోర్ట్స్‌ను వీక్షిస్తున్నారు. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తున్నారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించారు. ఈ సమయంలో బైడెన్‌ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసిన వారంతా బైడెన్‌కు ఏమైనట్టు అని అనుకుంటున్నారు. బైడెన్ ఇలా ప్రవర్తించడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందు చాలా సందర్భాలలో ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసేటప్పుడు కూడా అంతే! ఆ కార్యక్రమంలో చక్ షూమర్ పొడియం దగ్గరకు రాగానే ముందు బైడెన్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత స్టేజ్ మీద ఉన్న మిగతావాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. తను షేక్‌హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు తీసుకెళ్లారు. చేతిని కాసేపు అలాగే షేక్ హ్యాండ్ పొజిషన్‌లో ఉంచి షాక్‌తో మళ్లి చేతిని కిందకు దించాడు . దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే! మాట్లాడుతున్నప్పుడు రష్యా దేశాన్ని, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరును మర్చిపోయారు. తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించారు. మతిమరుపు జబ్బుతో బాధపడుతున్న బైడెన్ అధ్యక్ష పదవికి తగడంటూ ఆ మధ్యన విపక్షాలు విమర్శలు చేశాయి..