అమెరికా యూనివర్సిటీలలో(america Universities) పాలస్తీనా(Palastine) అనుకూల నిరసనలు(Protest) వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయాలు అట్టుడికిపోతున్నాయి. పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్ట్‌(student Arrest) చేశారు. యూనివర్సిటీల నుంచి నిషేధించారు కూడా! నిషేధానికి గురైన వారిలో భారతీయ సంతతికిచెందిన విద్యార్థిని కూడా ఉన్నారు.

అమెరికా యూనివర్సిటీలలో(America Universities) పాలస్తీనా(Palastine) అనుకూల నిరసనలు(Protest) వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయాలు అట్టుడికిపోతున్నాయి. పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్ట్‌(student Arrest) చేశారు. యూనివర్సిటీల నుంచి నిషేధించారు కూడా! నిషేధానికి గురైన వారిలో భారతీయ సంతతికిచెందిన విద్యార్థిని కూడా ఉన్నారు. ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో(Princeton University) చదువుతున్న అచింత్య శివలింగన్‌ను(achinthya shivalingan) పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాంపస్ ఆవరణలో విద్యార్థుల నేతృత్వంలోని పాలస్తీనా అనుకూల శిబిరం నిరసనలో పాల్గొన్నందుకుగాను ఆమెను యూనివర్శిటీనుంచి నిషేధించారు.గురువారం తెల్లవారుజామున యూనివర్సిటీ ప్రాంగణంలో క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల నిరసనల మధ్య శివలింగన్‌తోపాటు,మరో విద్యార్థి హసన్‌ సయ్యద్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. నిరసనను నిలిపివేసి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని పోలీసులు హెచ్చరించినా వారు వినకపోవడంతోనే వారిని అరెస్ట్ చేశామని పబ్లిక్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ యూనివర్సిటీ ప్రతినిధి తెలిపారు అచింత్య శివలింగన్‌ది తమిళనాడుకు చెందిన కోయంబత్తూరు. ఈమె ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌లో పబ్లిక్‌ అఫైర్స్‌లో మాస్టర్స్‌ చేస్తోంది. సయ్యద్‌ ఏమో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఇజ్రాయెల్‌ సైనిక చర్య కారణంగా గాజాలో చాలా మంది చనిపోతున్నారు. మరణిస్తున్నవారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉంటున్నారు. ఈ మరణాలకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు నిరసనలకు దిగారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో మొదలైన నిరసనలు అమెరికాలోని అనేక యూనివర్సిటీలకు పాకాయి.

Updated On 26 April 2024 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story